అంగాంగి భావము
మనమింతవరకూ రామాయణ కథా బంధనంలో ఇమిడి ఉన్న రామణీయక మేమిటో పరిశీలించి చూచాము. అదిమొదటి నుంచీ చివరదాకా ఏలా ఒక కథనం ప్రకారం సాగిందో కూడా కనుగొన్నాము. పోతే ఈ కథలనేవి ఇతిహాసంలో ఒకటిగాదు. అనేకముంటాయి. ప్రధానేతి వృత్తం ఒక్కటే అయినా దానితో ముడిపడి ఉంటాయి ఎన్నో ప్రాసంగికేతి వృత్తాలు. ప్రధాన కథ ఒక మహానది అనుకొంటే ఈ ప్రాసంగికాలన్నీ అక్కడక్కడ దానిలో వచ్చి కలిసే ఉపనదుల లాంటివి. ఈఉపనదులను తనలో కలుపుకొని బలాన్నీ, వేగాన్నీ పుంజుకొని ఒకే ఒక అఖండ వాహినిగా ప్రవహిస్తూ పోయి తన లక్ష్యాన్ని అందుకొంటుంది కథావాహిని.
ప్రస్తుత మీ రామాయణ కథావాహిని కూడా ఇంతే. ఇంతకు ముందు ప్రకరణాలలో వర్ణించినట్టు సీతా రాములకథే ఇందులో ప్రధానమైన ఇతివృత్తం. ఆది నుంచి అంతందాకా విడవకుండా వస్తూ ఉన్న పాత్రలు వారే. కథా వారిదే. అందుకే రామయణమనీ, సీతాచరితమనీ, కవి దీనికి నామకరణం చేసిందికూడా. అయితే కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు అంత మాత్రమే అయితే స్వారస్యం లేదు. రేఖా మాత్రంగా కనిపించే ఆ కథకు అనుబంధంగా ఎన్నో వన్నెలూ చిన్నెలూ పెట్టి అలంకరించవలసి ఉంది. వట్టి అలంకారమే కాక అవసరం కూడా అవి. అవి లేకపోతే కథకు ఒక సబబుగాని సమగ్రతగాని ఉండబోదు. వీటికే అంగమని ప్రాసంగికమని పేరు. ఏది లేకుంటే ఒకటి పరిపూర్ణం కాదో అది దానికంగం. ఈ అంగములతో కూడినది అంగి. అంగాంగి రూపమైన ఈ సంబంధం ఇతిహాసానికి చాలా ఆవశ్యకం. తన్మూలంగానే ఫలసిద్ధి ఇతివృత్తానికి.
రామాయణంలో సీతారాముల కథ గదా ప్రధానమని చెప్పాము. ఇది ఇతిహాసంలో అంగి. పోతే దీనికి దోహదం చేసే ప్రాసంగిక కథలెన్నో వర్ణిస్తూ వచ్చాడు వాల్మీకి. అవన్నీ దాని కంగభూతాలు. ఇవి ఒకటి కావు. రెండు కావు. చిల్లరమల్ల రవి కొన్ని వదిలేసినా పది పదిహేనుకు పైగానే ఉంటాయి. కథ నడుస్తూ ఉంటే అవసరం వచ్చినప్పుడల్లా ఆయా సందర్భాలలో ఉపనదులలాగానే కథా
Page 75