దగ్గర నుంచి రావణాదుల ఆయువు పట్లన్నీ ఏకరువు పెట్టి రాముడి విజయానికి తోడ్పడతాడు. ఆ తరువాత అయోధ్య చేరి పట్టాభిషిక్తుడైన రాముడికి సీతా లక్ష్మణుల సాంగత్యం వదలించి అతణ్ణి ఏకాంత రాముణ్ణి చేయటానికి మరి రెండు శక్తులు చేయి చేసుకొనటం చూస్తాము మనం. అవి ఒకటి ప్రజాశక్తి. మరొకటి దైవశక్తి. తన్మూలంగా ప్రాకృత బంధనిర్ముక్తుడైన రాముడు క్రమంగా అచ్యుత రాముడై తన మూలస్థానమైన వైకుంఠాన్నే చేరుకొంటాడు. ఈ ప్రకారంగా చూస్తు పోతే ఇది ఒక రమణీయతే కథా గతిలో.
ఇంతేకాదు. ఈ పాత్రలూ వీటి వ్యవహారమూ ఆలోచిస్తే చాలా చిత్రంగా
మనోహరంగా కనిపిస్తుంది రామాయణంలో. కథా గమనంలో ఇవి ఏవి ఎక్కడ
ఆరంభమవుతాయో, ఎంతవరకు నిలుస్తాయో, ఎక్కడ ముగుస్తాయో చెప్పలేము.
కొన్ని పాత్రలు మొదట వచ్చి మధ్యలో నిష్క్రమిస్తాయి. విశ్వామిత్రుడి పాత్ర అలాంటిదే.
బాలకాండ ఆరంభంలో వస్తాడు విశ్వామిత్రుడు. బాలకాండ ముగిసేదాకా ఉంటాడు
అంతటితో సెలవు తీసుకొంటాడు. ఇక అయోధ్యనుంచీ ఎక్కడా కనపడడాయన.
కథానాయకుణ్ణి ప్రయోజకుడిగా తీర్చిదిద్దటమే కవి ఆ పాత్ర కొప్పచెప్పిన బాధ్యత.
అది సక్రమంగా నిర్వహించి పోయాడాయన. పోతే పరశురాముడు కూడా అంతే.
బాలకాండ మరీ చివరిలో వచ్చి చివరిలోనే మాయమవుతుందా పాత్ర. వైష్ణవ
ధనుస్సుతోపాటు వైష్ణవ తేజస్సు కూడా ఆయనలో సంక్రమింపజేసి పోవటమే దాని
ప్రయోజనం. కొన్ని పాత్రలు మొదటి నుంచీ ఉండి మధ్యలో మాయమవుతాయి.
దశరథాది పాత్ర లలాంటివే. బాల అయోధ్యల వరకే దాని ప్రయోజనం.
కథానాయకుడి అరణ్య గమనానంతర మిక దాని ప్రయోజనం లేదు. అంతరించ
వలసిందే. పోతే మరి కొన్ని మధ్యలోనే వచ్చి మధ్యలోనే తొలగిపోతాయి. గుహుడు,
జటాయువు, సంపాతి, శబరి, సుతీక్షాది, మహర్షులూ ఇలాంటివారే. రాముడికెక్కడ
కక్కడ ఆయా సందర్భాలలో తోడ్పడటమూ, ఆయన వల్ల తోడ్పాటు పొందటమే
వాటిప్రయోజనం. అలాగే జరుగుతూ వచ్చింది కథలో. కబంధ విరాధాది శాపగ్రస్తుల
విషయం కూడా ఇదే. మరి వారి వృత్తాంతం కూడా మధ్యలో వచ్చి మధ్యలో
అంతర్ధానమయిందే. అది రాముడు జగదేకవీరుడని, రామబాణానికి తిరుగులేదని
చాటటానికే. తద్ద్వారా రావణ సంహారమిక తప్పదని వ్యంగ్యంగా చెప్పటానికే. పోతే
Page 73