#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

వచ్చినంత వరకూ ఉన్నాయని చెబుతాం. రాకుంటే లేవంటాం. ఒకవేళ అక్కడికి వెళ్లి చూస్తే అప్పుడు చూచినంత మేర ఉన్నాయనే చెబుతా మంత మాత్రమే.

  ప్రమాణాన్ని బట్టి ప్రమేయానికి అస్తిత్వమని పేర్కొంటారు శాస్త్రజ్ఞులు. ప్రమాణం మనకు మనబుద్ధే. బుద్ధిర్షినః ప్రమాణం సదసతో ర్యాథాత్మ్యాధిగమే. ఒకటి ఉందని గాని లేదనిగాని నిర్ణయించేది మానవుడి బుద్ధే నంటారు స్వామివారు. యద్విషయా బుద్ధి ర్వ్యభిచరతి తదసత్ యద్విషయా న వ్యభిచరతి తత్సత్. దేని విషయంలో బుద్ధి ప్రక్కకు పోతుందో అది అసలే లేదు. ఏది అలా తొలగిపోదో అది ఉన్నదని సిద్ధాంతం చేశా రాయన. ఉదాహరణకు దూరాన మనకు నీళ్లు పొంగి పొర్లుతున్నట్లు కనిపిస్తాయి. కాని దగ్గరికి వెళ్లి చూస్తే అవి నీళ్లే కావు. అక్కడ ఉన్నది సూర్యరశ్మి. ఇప్పు డున్నదేది లేనిదేది. ఉన్నది రశ్మి. లేనిది జలం. కాని విమర్శించి చూడకపోతే లేని జలమే ఉన్నదని స్ఫురించింది. ఉన్న రశ్మీ లేదని భాసించింది. అంటే ఉన్నది లేదని చూచావు నీవు. లేనిది ఉందని చూచావు. అవునా కాదా. ఇలా ఎన్నో ఉన్నాయి మన దైనందినాను భవంలో.

Page 72

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు