#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

హామీ ఇచ్చాడు గదా పరమాత్మ. కారణ మేమంటే మనమే ఉన్నా మీ సృష్టిలో మరేదీ లేదు. అంటే ఏమని అర్థం. ఆత్మ చైతన్యానికి భిన్నంగా-ఈ మాత్రలూ లేవు. ఈ స్పర్శలూ లేవు. తద్వారా కలిగే సుఖదుఃఖాదు లంత కన్నా లేవు. అసలీ సంసారమే లేదు. ఎంచేత. నాసతో విద్యతే భావః - లేని పదార్ధ మెప్పుడూ లేదు. నాభావో విద్యతే సతః - ఉన్నదాని కెప్పుడూ మోసం లేదు. అది ఎప్పుడూ ఉంటుంది. లేని దెంత ఉందను కొన్నా ఉండబోదు. అలాగే ఉన్న పదార్థ మెంత లేదని త్రోసిపుచ్చినా లేకుండా పోదు. ఇంతకూ ఉన్నదే ఉంటుంది. లేనిది లేనే లేదు.

  ఏమిటీ మాటల కర్ధం. నిజంగా భగవద్గీత లాంటి శాస్త్రం చెప్పవలసిన మాటా ఇది. శాస్త్ర మెప్పుడూ మన కనుభవంలో లేని రహస్యాన్ని బయటపెట్టాలని గదా చెప్పాము. ఉపనిషన్నామ రహస్య విజ్ఞాన మని భగవత్పాదులే వాక్రుచ్చా రొక చోట. అలాంటప్పుడీ మాటేమిటి మనమెప్పుడైనా లేనిది ఉన్నట్టు గాని ఉన్నదాన్ని లేనట్టుగాని చూస్తామా. మెడకాయ మీద తలకాయ ఉన్న వాడెవడు గానీ చేయ డలాటి పని. ఒక కుండ కండ్లకు కనిపిస్తుంటే ఉందని చూస్తాం. పగిలిపోతే లేదని చూస్తాం. అంతేగాని కనిపిస్తున్నా లేదని చెప్పం. కనిపించకపోయినా ఉందని బుకాయించం. అయితే చంద్రమండలంలో ఇప్పుడెన్ని ఉన్నాయో మనం చూడటం లేదు గదా. అవి ఉన్నాయా లేవా అని అడిగితే మనసుకు

Page 71

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు