సాంఖ్య యోగము
భగవద్గీత
నిరూపణ చేసి చూపినప్పుడది ఎంత యధార్ధమా అని అంత కన్నా ఆశ్చర్యం గొలుపుతుంది. వారు చూపే ఉపపత్తి Argument ఏమిటంటే ఒక ఆభరణం నీకు కనిపిస్తున్నదంటే అది దాని మూల పదార్ధమైన బంగారం కంటే వేరుగా లేదు. ఆ బంగార మక్కడి కాగదు. అది ఆ బంగారు గని కంటే వేరే ఎక్కడా లేదు. ఆ గని పృధివీ తత్త్వం కన్నా భిన్నంగా లేదు. కఠినమైన ఈ పృధివి ద్రవరూపమైన జలం కన్నా వేరుగాదు. అది ద్రవీభవించిన తేజస్సే మరేదీగాదు. ఆ తేజస్సు వాయువే ఘర్షణ చెంది అలా మారింది గనుక దానికి విలక్షణం కాదు. చలించే ఆ వాయువు కూడా అచలమైన ఆకాశం కన్నా వ్యతిరిక్తం కాదు. మరి ఆకాశమో. అక్కడి కాగ వచ్చుగదా మనం. అన్ని చరాచర పదార్ధాలకూ మూల భూతమదే గదా. అదే అంతకన్నా మరేదీ లేదని అక్కడికే ఆగిపోతారు భౌతిక శాస్త్రజ్ఞులు. కాదు దానికి కూడా మూలముంది అదే చిద్రూపమైన ఆత్మ అంటారు వేదాంత శాస్త్రజ్ఞులు. ఆకాశం సత్తయితే దాని అస్తిత్వాన్ని కూడా గమనించే ప్రమాణం చిత్ లేదా చైతన్యం Pure Awareness or Con-sciousness ఇక దానికేమిటి ప్రమాణమని ప్రశ్న లేదు. దానికదే ప్రమాణం. జ్ఞానం గదా అది. తనకు తానే ప్రమాణం. దీన్నే స్వతః ప్రమాణ Self Evident మంటారు.
ఇప్పుడీ జ్ఞానమనండి. ఆత్మ అనండి. ఇదే మొత్తం ప్రపంచాని కాధారం. దీనిమీద ఆధారపడే మిగతా ప్రపంచ మంతా స్ఫురిస్తున్నది.
Page 74