#


Index

కథా సంవిధానము

కెగ్గులు చెప్పి రాముణ్ణి అడవికి పంపటంలో కృతకృత్యఅయింది. అంటే ఏమన్నమాట. మారీచ దండకా ప్రవేశంతో బీజప్రాయంగా ఏర్పడినదిప్పుడు మంథరా కుటిలనీతి ప్రయోగంతో మొలకెత్తింది. దానితో రాముడిక దండకలో ప్రవేశించక తప్పిందికాదు. అలా ప్రవేశించి తన పాటికితాను బ్రతుకు సాగిస్తే ఎలాగ. సీతావియోగం జరిగి తీరాలి. తీరాలంటేదానికి పూనుకోవలసిన వ్యక్తి ఒక్కతే ఉంది. అది శూర్పణఖ. సాక్షాత్తూ రావణుడి చెల్లెలే అది. ఖరదూషణాదులకు కూడా చెల్లెలే. మరి వారెక్కడ ఉన్నారు. దండకలోనే. వారి నది రాముడి మీదికి పురికొల్పింది. కొల్పితే వారిని వారి పదునాలుగు వేల సైనికులతో కూడా నేలగూల్చాడు రాఘవుడు. దానితో మరీ రెచ్చిపోయి అదిరావణుణ్ణి రెచ్చగొట్టింది. ఊరక రెచ్చగొట్టటమే గాక సీతా సౌందర్యాన్ని వర్ణించి వాడి కావిడ నపహరించి తేవాలనే కాంక్షను రేకెత్తించింది. దీని కంతటికీ మూలకారణం తాను రాముణ్ణి మోహించి అతనిచేత పరాభూత కావటమే. కాబట్టి మారీచుడి పాత్ర బాలకాండలో బీజావాపం చేస్తే అది అయోధ్యలో మంథరచేత అంకురిస్తే అరణ్యంలో ఈ శూర్పణఖచేత అది క్రమంగా మొగ్గతొడిగింది.

  మొగ్గ తొడిగి అక్కడికి నిలువలేదది. క్రమంగా వికసించి పుష్పించి ఫలించాలి గదా ! దానికి తరువాతి కాండలలో ఆయా కీలకమైన పాత్రలు దోహదం చేస్తూనే వచ్చాయి. అయితే ఇందులో చమత్కారమేమంటే మొదటి మూడు కాండలలో మారీచ మంథరా శూర్పణఖలు ప్రతికూలంగా చేశారా దోహదం. పోతే కిష్కింధనుంచీ అది అనుకూలంగా సాగింది. కథాగమనంలో ఇది ఒక చమత్కారం. విరాధుడు రాముడిచేత శాపవిముక్తుడై ఆయనకు సుగ్రీవ వృత్తాంతం వినిపించి వెళ్లిపోతాడు అరణ్యాంతంలో అంటే అరణ్యం నుంచి రాముణ్ణి క్రమంగా కిష్కింధకు చేర్చటానికి తోడ్పడిందా పాత్ర. కిష్కింధలో హనుమంతుడు తోడవుతాడురాముడికి. ఇతడు కిష్కింధలో కీలకపాత్ర. రాముడికి నమ్మిన బంటయి అంతడి అంగుళీయకం తీసుకొని లవణసాగరాన్ని దాటిపోయి లంకలో సీతను చూచి మరలా వచ్చి రాముడికి నివేదిస్తాడు. ఇది సుందరలో జరిగిన వృత్తాంతం. దీనితో కథ ముకుళావస్థ నుంచి వికచావస్థకు వచ్చింది. అది ఇక పుష్పించాలంటే దానికి చేయూతనిచ్చే పాత్ర ఒకటి కావాలి. అది విభీషణపాత్ర. సరిగా లంకా ప్రవేశమయి యుద్ధానికుపక్రమించే సమయానికి వచ్చాడతడు. రాముణ్ణి శరణుజొచ్చాడు. శుకసారణులను పట్టి ఇవ్వటం

Page 72

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు