#


Index

కథా సంవిధానము

అయిదవ సమస్యకు పరిష్కారంచేసే ప్రయత్నమే. జాంబవదాదులంతా చేతులెత్తి హనుమంతుణ్ణి శరణువేడి అతణ్ణి ప్రోత్సహిస్తే అపార బలపరాక్రమ సంపన్నుడైన ఆ హనుమ సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశిస్తాడు. మనమూ ఆయనతోపాటు లంకలో ప్రవేశించాము. కాని ఏమి సుఖం మరలా అక్కడ ఒక పెద్ద సమస్య ఎదురయింది. అది సీతాన్వేషణం. ఎంత తిరిగినా ఎంత గాలించి చూచినా కానరాలేదా జగన్మాత వాతాత్మజుడికి. చివరికెలాగో కష్టపడి చూడగలిగాడు ఎక్కడో అశోక వనంలో శోకిస్తూ కూచున్న ఆ మూర్తిని. ఆ ఉత్సాహంతో వనాన్ని భగ్నం చేశాడు. కనపడ్డ రాక్షసులనంతా అంతమొందించాడు. కడకు నాగపాశబద్ధుడయి రావణుణ్ణి సందర్శించి అతడు వాలానికి నిప్పుపెడితే దానితో కోలాహలంగా పట్టణాన్నే దహించి మరలా రామపాద మూలాన్ని చేరుతాడు. అమ్మవారిని చూచివచ్చిన వృత్తాంతం చెప్పి అతణ్ణి సంతోషపరుస్తాడు. ఇక్కడికా సమస్యా ఆకాండ కూడా సమసిపోతాయి.

  అయినా పూర్తిగా సమసిపోలేదు సమస్య. ఇల్లలుకగానే పండగ కాదు కదా. అది ఇప్పుడు మరొక సమస్యకు దారితీసింది. సీత విషయం తెలిసింది. తన మనిషి అక్కడికి పోయి వచ్చాడు. ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసు. ఎలా ఉందో తెలుసు. కాని ఆవిడ నా బంధం నుంచి విడిపించటమెలాగ. అసలక్కడికి తాను వెళ్లటమెలాగ. మధ్యలో ఉన్నది ఒక మహాసముద్ర మాయె. తనకెంత సైన్యసంపద ఉన్నా దాన్ని దాటిగదా వెళ్లవలసింది. మరి అది తనకు దారి ఇస్తుందో లేదో ? ఇది ఒక పెద్ద సమస్య ఇప్పుడు. దీనితో మరొక ఆరవ మలుపు తిరిగింది కథ. దీని పరిష్కారమే రాముడి దర్భశయనం. క్రోధాతిరేకం. సాగర శరణాగతి. సేతు బంధనం. లంకా ప్రవేశం. తరువాత రాక్షస వానరయుద్ధం. చివరకు రావణ సంహారం. అయోధ్యా పునరాగమనాదికం. మరలా పట్టాభిషేకంతో ఇక ఏ సమస్యా లేదు గదా అనుకొంటాము మనం. నిజంగా లేకపోవలసిందే మరి. అయినా సమస్య ఒకటి ఏర్పడనే ఏర్పడింది. సుఖంగా సాగే రామరాజ్యంలో ఒక దారుణమైన సమస్య కాజ్యం పోసింది ప్రజావాణి. దానితో పూర్వం ఉత్తరానికి దారితీసింది కథలో. ఈ ఉత్తరానికి తగిన ఉత్తరమిక సీతా పరిత్యాగమే అయి కూచుంది. దానితోనూ తీరలేదా సమస్య. అది మరొక చిన్నసమస్యను లేవనెత్తి లక్ష్మణ బహిష్కారానికి కూడా

Page 70

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు