#


Index

కథా సంవిధానము

ఇక కిష్కింధ చేరకముందే హనుమంతుడే తనకు దర్శనమివ్వటం అతడికే తాను అభిజ్ఞానమివ్వటం స్వయం ప్రభాదులతో అతడే ముచ్చటించటం జాంబవంతుడతనినే ప్రోత్సహించటం ఇదంతా సుందరకాండ వృత్తాంతం ముందుగానే సూచిస్తున్నది. సముద్రాన్ని అతడు లంఘిస్తున్న సమయంలో సురసా, సింహికాదుల అంతరాయమూ, మైనాక వృత్తాంతమూ లంకిణీ వృత్తాంతమూ, గత వృత్తాంతాన్ని స్ఫురణకు తెస్తుంటాయి.

  సీతతో హనుమంతుడు చేసిన ప్రసంగంలో ప్రసంగవశాత్తు ఆవిడ అరణ్యంలో జరిగిన విషయాలు కొన్ని ఏకరువు పెడుతుంది. అది గత విషయమైతే హనుమంతుడు అశోక వనభంగం చేసి రాక్షసుల నెందరినో మట్టుపెట్టి చివరకు లంకాదహనం చేసిపోవటం, యుద్ధమిక అనివార్యమనీ, అందులో రాక్షస పరాజయం జరిగి తీరుతుందనీ భవిష్యత్సత్యాన్ని మనకు చాటి చెప్పటమే. మరి విభీషణుడు హనుమత్పక్షం చేరి సమర్థించటం, రాముడికి సీత నప్పగించమని ప్రబోధించటం, అతడు యుద్ధం జరిగే నాటికి రాముడి పక్షంలో చేరుతాడని సూచనే. రాముడతని కెందరు వద్దన్నా ఆశ్రయమివ్వటం ముందుగానే అభిషిక్తుణ్ణి చేయటంకూడా రాగల ఘట్టానికొక గొప్ప సూచనే. మరి విభీషణుడు యుద్ధమధ్యంలో ఇంద్రజిద్రావణాదుల కిటుకులూ కీలకాలూ, అన్నీ బయటపెట్టటం జరిగిన కాలాన్ని మనకు జ్ఞప్తికి తెస్తుంది. పోతే రావణ వధానంతరం సీతను రాముడు ముందుగానే అనుమానించి అగ్ని ప్రవేశం చేయించటం తరువాత ఉత్తరకాండలో జరగబోయే సీత అత్యంత పరిత్యాగానికి నాందీ పలుకుతుంది. దేవతలంతా ప్రత్యక్షమయి రాముణ్ణి ప్రశంసించటమూ, అతణ్ణి తరువాత వైకుంఠ గమనానికి తొందర చేయటమే ననిపిస్తుంది. ఇలా అన్వేషిస్తూ పోతే ఎక్కడి కక్కడ మన మాయాపాత్రలతో పాటు వర్తమానంలో ఉంటూనే అంతకు ముందు జరిగిన సంగతులు వింటూ ఆ పిమ్మట జరగబోయే సంగతులకు సూచనలు గ్రహిస్తూ పోతాము. దీనితో భూత భవిష్య ద్వర్తమానాలు మూడింటికీ కథాగమనంలో ఒక అంతర్గతమైన గ్రంధి సహజంగానే ఉన్నట్టు మన మనోనేత్రానికి సాక్షాత్కరిస్తుంది.

  అంతేకాదు కథాగమనమన్నాను నేను. నిజంగా అది ఒక గమనమే. ఒక జీవనదిలాగా అది ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది. అలా ప్రవహించటంలో

Page 67

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు