#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

అర్ధం. ఇక్కడ కేవలం మానవుడనే అర్ధంలో వాడటం లేదీ పురుషుడనే మాట వేదవ్యాసుడు. మరేమని అర్థమీ మాటకు. పూర్ణత్వాత్ పురుషః పరిపూర్ణత
Completion or perfection
ఉన్న వాదేవడో వాడు పురుషుడు అలాటి పూర్ణత్వం లేకుంటే కేవలం పురిశయనాత్ పురుషః బ్రహ్మపురమైన ఈ మానవ శరీరంలో శయనిస్తున్న ప్రతివాడూ పురుషుడే. శయనించటమంటే పడుకొని నిద్రపోయేవాడు. నిద్రపోయేవాడు పురుషుడెలా అవుతాడు. అలాగైతే పశుపక్ష్యాదులు కూడా పురుషులే. వాసనా జ్ఞానంతో బ్రతికే వన్నీ నిద్రాళువులే. మానవుడూ అలాటివాడే నని పించుకొంటే సుఖ మేముంది. వీడీ శరీరంలో వచ్చి కూచునే వరకే గాదు. జ్ఞానం సంపాదించి పూర్ణు డనిపించు కోవాలి. అప్పటికీ అది పూర్ణత్వం కాదు. ఆ జ్ఞానమైనా వృత్తి జ్ఞానమైతే లాభం లేదు. ఆయా శాస్త్ర జ్ఞానాలూ కళాజ్ఞా నాలూ కడకు ధర్మజ్ఞానమూ కూడా కాదు జ్ఞానమంటే మరి ఏజ్ఞానం. బ్రహ్మపురంలో వచ్చి కూచున్నందుకు బ్రహ్మ జ్ఞాన మార్జించాలి. అప్పుడే వాడు పూర్ణపురుషుడు. పురుష శబ్దానికి పురిశయనాత్ - పూర్ణత్వాత్తని మాత్రమే గాక పూరణా త్పురుషః అని మూడవ అర్ధం చెప్పవలసి ఉంటుందప్పుడు. పూరణ మంటే ఈ శరీరం మేరకే ఈ మనస్సు మేరకే ఈ ఆలోచనల మేరకే ఈ ఈ విషయాల మేరకే బ్రతుకుతు న్నాననే గాక - వీటికి విలక్షణంగా ఉంటూ వీటన్నింటినీ పూరించి వ్యాపించి ఉన్నాననే జ్ఞానం. అప్పుడే పూర్ణ పురుషు డని పించుకోగలడు.

Page 68

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు