సాంఖ్య యోగము
భగవద్గీత
మారకుండా వాటి మార్పుల నెలా అనుభవించ గలదు. సుఖాకారంగా దుఃఖాకారంగా మనసు మారటానికే వృత్తి అని పేరు. ఆలోచనల పుట్టే గదా మనసు. ఆలోచన ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కాబట్టి ఆలోచనే వృత్తి సుఖాదుల కనుగుణంగా తదాకార వృత్తులు Both Ideas and Things కూడా మారుతున్నాయంటే రెండూ ఆగమాపాయులే. అలాంటప్పుడు అనిత్యంగాక నిత్యమెలా అవుతాయవి. ప్రమాణ ప్రమేయాలు రెండూ అనిత్యమే. అంటే బాహ్యమైన వస్తువులూ Things మనసులో కలిగే వృత్తులూ Ideas రెండూ నిలకడ లేకుండా మారిపోయేవే.
అలాంటప్పుడిక మారకుండా అనాగమంగా అనపాయంగా ఉన్నదేది. ఏదీ లేదా. లేకుంటే ఈ మార్పుల కర్ధం లేదు. మార్పులే మార్పులను గమనించలేవు. మార్పులేనిదే మారుతూ ఉన్నవాటికి సాక్షి. అది ఏదో గాదు. మనలో ఉన్న జ్ఞానమే. మనసే గదా జ్ఞానమంటే. కాదు అది జ్ఞానంలో కలిగే వృత్తి లేదా వృత్తి జ్ఞానం. కేవల జ్ఞానం కాదు. పరిశుద్ధమైన జ్ఞాన మయితేనే గాని అది వీటన్నింటి రాకపోకలకూ సాక్షి అనిపించుకోలేదు. ఇదుగో ఈ సాక్షి జ్ఞానమే ఆత్మ స్వరూపం. అది తాను స్థిరంగా ఉంటూ అస్థిరమైన ఈ మార్పు లన్నిటినీ చూస్తున్నది. మనసు దగ్గరి నుంచీ దాని ఆలోచనల దగ్గరి నుంచీ అందులో ప్రతి ఫలించే బాహ్యమైన శబ్ద స్పర్శాదుల వరకూ అన్నిటినీ కనిపెట్టి చూస్తున్నది. మన మనస్సు గాక అలాంటి దొకటి ఉందా అని సందేహించ బని లేదు.
Page 66