#


Index

కథా సంవిధానము

ఉంటుంది. విశ్వామిత్రుడు రాముణ్ణి తనవెంట కొనిపోతూ మార్గమధ్యంలో వినోదార్ధం ఆయనకెన్నో కథలూ, గాథలూ చెబుతూ పోతాడు. అవన్నీ దేవతా వృత్తాంతాలే. ఒక గంగావతరణమే గాదు. కుమార సంభవమే గాదు. అహల్యా సంక్రందనమే గాదు. అన్నీ దివ్యమైనవే. తుదకు జనక సభలో శతానందుడు రాముడికి చెప్పిన తన వృత్తాంతం కూడా దివ్యమైనదే. ఇలా బాలకాండ అంతా దేవతల కథలతోనే నిండి ఉంటుంది. అది ఏ దేవలోకాలకో మనలను తీసుకుపోతుంది. కాగా అయోధ్యాకాండ అక్కడి నుంచి మరలా మనలను మనుష్యలోకానికి తీసుకు వస్తుంది. ఇది భూమిమీద పట్టణాలలో మనబోటి మానవుల మధ్య జరిగిన సన్నివేశాలను వర్ణిస్తుంది. పోతే అరణ్యకాండ పట్టణాల నుంచి అరణ్య ప్రదేశాలకు చేరుస్తుంది మనలను. మామూలు మానవుల మధ్య నుంచి తపస్సంపన్నులైన మహర్షుల మధ్య చేరుస్తుంది. అక్కడి నుంచి కిష్కంధకాండకు వచ్చేసరికా అరణ్యాలనుంచి సరాసరి పర్వతాలూ, పర్వతగుహలు శిఖరాలు ఇలాంటి ఉన్నత ప్రదేశాలకు చేరుకొంటాము మనం. అక్కడ దేవతలుకారు. మానవులు కారు. మహర్షులూ కారు. వారికి భిన్నంగా వానరులు. ఆ వానరులు కూడా ఒక జాతికాదు. ఋక్ష, వానర, ఆచ్ఛభల్ల, గోలాంగూలాలని నాలుగు జాతుల జంతువులున్నా యందులో. ఇలా చిత్ర విచిత్రమైన జంతు లోకంలో వచ్చి పడుతాము కిష్కంధలో. పోతే అది కూడా దాటి సుందరలో ప్రవేశించే సరికి అది పట్టణాలూ కావు. పర్వతాలూ కావు. అరణ్యాలూ కావు. సముద్ర మధ్యంలో వచ్చి కూచుంటాము. దక్షిణ మహాసముద్రంలో సువేలాద్రి అయితే ఆ పర్వతంమీద ఉంది లంక అనే ఒక మహానగరం. అక్కడ ఉన్నవారెవరు. దేవతలా మానవులా మహర్షులా. తుదకు జంతువులా. ఎవరూ కారు. కామరూపులూ కర్కశ స్వభావులూ అయిన రాక్షసులు. వారి మధ్య వచ్చిపడతాము సుందరలో. పోతే ఇక యుద్ధకాండకు వచ్చే సరికది ఈ దివ్యభౌమాల రెండింటి సమాహారం. అక్కడ మనకన్ని జాతులవారూ ప్రత్యక్షమవుతారు. దేవతలేమిటి. సమస్తమూ అక్కడ సమావేశమయినట్టు భాసిస్తుంది.

  మొత్తంమీద బాలనుంచి యుద్దవరకూ సాగిన ఆరుకాండల తీరూ పరిశీలిస్తే కాండలనే పేరుతో మహర్షి బ్రహ్మండాన్నంతటినీ పట్టి తెచ్చి తన కావ్యమనే దర్పణంలో పెట్టచూపాడా అని తోస్తుంది. దేశకాల పాత్రలనే మూడూ వాటి పరిధులు

Page 64

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు