#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

కొలత వేయ బడుతుంటాయి కాబట్టి Measured వాటికి ప్రమేయమని పేరు వచ్చింది.

  ఒక్క చక్షురాది బాహ్యేంద్రియాలే గాదు మాత్రలు. ఆ మాటకు వస్తే మనస్సూ ప్రాణమనే అంతరింద్రియాలు కూడా ప్రమాణాలే మాత్రలే. ప్రాణ మాయా క్రియలనైతే మనస్సు ఆలోచనలనూ సుఖదుఃఖా ద్యనుభవాలను కూడా కొలిచి చూపుతున్నది. కొలిచి చూపే ఇంద్రియాలు మాత్రలైతే వీటిచేత కొలవబడే శబ్ద స్పర్శాదులు కూడా మాత్రలే నన్నారు అభిజ్ఞులు. అప్పుడు మీయంతే ఇతి మాత్రా అని అర్ధం చెప్పుకోవాలా మాటకు. మొత్తం మీద మాత్రలంటే అప్పటికే మని అర్ధం. ప్రమాణా లైనమనఃప్రాణచక్షురాదీంద్రియాలూ - ప్రమేయాలైన శబ్దాదులైన ఇంద్రియార్థాలు Objects కూడా కలిసివస్తాయి. పంచతన్మాత్రలని అందుకే అన్నారు శబ్దాదులైన బాహ్య విషయాలను. ఇప్పుడు మాత్రలనే మాటలో ప్రమాణ ప్రమేయాలు రెండూ చేరిపోయాయి కాబట్టి ఇక ఏదీ మిగల లేదు సృష్టిలో. అంతా ఇందులోనే ఇమిడిపోయింది సంసారం.

  అలాంటప్పుడిక జరుగుతున్న వ్యవహార మేమిటో చెబుతున్నది గీత. ఈ మాత్రలా మాత్రలతో నిత్యమూ సంబంధం పెట్టుకొంటూ ఉంటాయి. ఏ మాత్రలే మాత్రలతో ఇంద్రియాలనే మాత్రలు శబ్దాదులనే మాత్రలతో. చెప్పాము గదా కన్ను రూపంతో చెవి శబ్దంతోనని. అలాంటి సంబంధానికే స్పర్శ అని Contact పేరు. ఈ స్పర్శ వల్ల ఏమవుతున్న

Page 63

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు