#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

అన్నది గదా ఉపనిషత్తు - ఆకాశ ఇవ స్వరూపమ్ యస్య అని అర్ధం వ్రాశారు భాష్యకారులు. అదే వాడి దేహ మనుకొంటే సరిపోతుంది. చిదాకాశమే దేహం. దానికి చావు పుట్టుక లేమున్నాయి. నిత్యమూ నిర్వికారమూ అది. కాబట్టి ప్రత్యగాత్మ నే అనే భావముంటే అసలైన ధైర్యమది. నముహ్యతి. మోహమే లేదప్పుడు. ప్రజ్ఞానమ్ బ్రహ్మ అన్నట్టు అంతా జ్ఞాన స్వరూపమే. నత్వే వాహం జాతు నాసమనే ముందు శ్లోక మీ ప్రత్యగాత్మ దృష్ట్యా చెప్పిన మాట. దేహినోస్మిన్ అని ఇప్పుడు చెప్పింది జీవాత్మ దృష్ట్యా చెబుతున్నది. ఇదీ తేడా.

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినోఽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత || 14 ||

ఇప్పు డర్జునుడికి సవాలిది. తాను జీవాత్మ దృష్టితో బ్రతుకుతున్నాడా లేక ప్రత్యగాత్మనని గుర్తించి బ్రతుకుతున్నాడా తేల్చుకోవలసి ఉంది. జీవాత్మనే అనుకొన్నాడా. అయితే మాత్రా స్పర్శలు తప్పవు. మాత్రలేమిటి స్పర్శలేమిటి. మీయంతే ఆభిరితి మాత్రా అంటున్నారు భగవత్పాదులు. శబ్ద స్పర్శాదులను కొలి చేస్తున్నాయి మన ఇంద్రియాలు. కన్ను రూపాన్నీ చెవి శబ్దాన్నీ నాలుక రసాన్నీ ఇలా ఇది ఫలానా ఇదిఫలానా అని నిర్ణయించటమే కొలవటం. ప్రతి ఇంద్రియమూ చేస్తున్న పని ఈ కొలవటమే. ఇంద్రియాలకు ప్రమాణాలని పేరు. ప్రమాణమంటే కొలవటం Measurement అనే అర్థం. ఇవి కొలుస్తుంటే శబ్దాదులు వీటి చేత

Page 62

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు