సాంఖ్య యోగము
భగవద్గీత
దంటే శీతోష్ణ సుఖదుఃఖదాః ఇది శీతమని ఇది ఉష్ణమని మన జ్ఞానానికి సోకుతున్నది. అంతేకాదు. దానివల్ల కలిగే సుఖదుఃఖాలు మన మనస్సుకు వస్తున్నాయి. శీతోష్ణాలనేవి త్వగిం ద్రియానికే గదా మిగతా చక్షురాదుల మాటేమిటని అడగ నక్కరలేదు. త్వగింద్రియం మిగతా అన్ని ఇంద్రియాలకైతే ఉపలక్షణంగా
Representative తీసుకోవాలి మనం. అప్పటికి శీతోష్ణాల స్పర్శ ఇంద్రియాలకైతే దానివల్ల కలిగే సుఖదుఃఖా ద్యనుభవం మనస్సు కని అర్ధం చేసుకోవలసి ఉంది. దీనితో అంతరింద్రియ బహిరింద్రియా లన్నీ కలిసి వచ్చాయి. ఇదే గదా సాంసారిక మైన వ్యవహార మంతా అనుభవానికి వచ్చే బాహ్య సామగ్రి - దానినెప్పుడూ అనుభవిస్తున్న ఆంతరిక Internal మైన మనస్సు. ఇంతకన్నా ఏముంది.
ఇంతవరకూ మన అనుభవంలో ఉన్న విషయమే. అది కూడా ఇంత పెద్ద విశ్లేషణ analysis చేసి అనుభవించటం లేదు మనం. ఏదో యాదృచ్ఛికంగా జరిగి పోతున్నట్లు చూస్తుంటాము. అలా కాదు రోజూ జరుగుతున్న వ్యవహారంలో ఇంత మర్మ మిమిడి ఉంది సుమా అని శాస్త్రం మనకు ముందు గుర్తు చేస్తున్నది. అలా చేసి మనకు సాధారణంగా తెలియని వేరొక రహస్య మిప్పుడు బోధిస్తున్నది. అదేమిటంటే ఆగమాపాయి నో నిత్యాః ఈ సంబంధా లన్నీ ఏమను కొంటున్నావో నీవు. నిజంగా ఉన్నాయి మన మనుభవిస్తున్నా మనే అనుకొంటున్నావా కాదు. అదంతా వట్టిది. అబద్ధం నిత్యం కాదది అనిత్యం. ఎందువల్ల.
Page 64