#


Index

కథా సంవిధానము

పూర్వకాండా కథాభాగాలలో మనకు కొన్ని విషయాలంతు పట్టకుండా చేసి పోనుపోను వాటి మూలతత్త్వాన్ని మనకు విశదం చేస్తూ రావటం మహాకవి కథాకల్పనలో దాగి ఉన్న ఒక మహాశిల్పం. ఒక మనోజ్ఞమైన నాటకీయత. ఇలా పాటించినప్పుడే అది సహృదయుల హృదయ దర్పణాలలో ప్రతిఫలిస్తుంది. బాగా ప్రకాశిస్తుంది. పునః పునరనుసంధానయోగ్యమై చిరస్మరణీయ మవుతుంది.

  ఇది సాహితీపరంగా నైతే ఆధ్యాత్మికంగా మరొక విశేషం కూడా ఉంది ఇందులో. ఎంతెంత విమర్శిస్తూ పోతే అంతంతగా భాసిస్తూ పోతుంది. ఉత్తరమే పూర్వానికంతటికీ బీజభూతమని గదా పేర్కొన్నాము. అది సీతా రాముల మూలతత్త్వాన్ని మనకు బోధించేగాథ. ఆ మూలతత్త్వాలేవో గావు. ప్రకృతి పురుషులే. మాయేశ్వరులే వేదవతి అంటే వాఙ్మయి అయినకన్య అనే చెప్పాడు వాల్మీకి. ఆ వాక్కే పరావాక్కు అదే పరాశక్తి. అది పరమేశ్వరుడికి నిత్యానపాయిని. క్షణకాలం కూడా తదీయ వియోగం సహించలేదు. అందుకే తపస్సు చేసి ఆయనను పొందాలనే కోరిక. దానికి నిమిత్తమయ్యాడు దశగ్రీవుడు. తద్వధాపదేశంతో సీతగా జన్మించి అప్పటికే దాశరథిగా అవతరించిన పరమాత్మ నాశ్రయించింది. ఇలాంటి ఈ ప్రకృతి పురుషులీ ఆదిదంపతులాడిన మహానాటకమే ఇక ఈ పూర్వరామాయణమంతా. ఉత్తరంలో వారికి కలిగిన సూక్ష్మం కాబట్టి తదనుగుణంగా ఉత్తరకాండ పరిమాణంలో అల్పతరమైతే స్థూలమైన వారి జీవిత కథ కనురూపంగా పూర్వ రామాయణం బృహత్తరమయింది. మన సంకల్పానికి బాహ్యమైన వ్యాఖ్యానమే గదా జీవితమంటే. అలాగే పరమాత్మ సంకల్పానుసారమే ఆయన జీవితం కూడా. అది విభూతి. మనది సంసారం. అంతే తేడా. మొత్తానికి ఇతిహాసాంతంలో గుప్తంగా సూచితమైన సీతారామ లీలావైభవమే తదారంభం నుంచీ అంతందాకా శాఖోపశాఖలుగా విస్తరించి పరచుకొని కనిపిస్తుంది.

  బాలకాండ నుంచీ యుద్ధకాండ వరకూ దాని వ్యాఖ్యానమే. ఆ విభూత్యావిష్కరణమే. దానిని ద్యోతనం చేయటానికి తదనుగుణంగా మహర్షి మలచుకొంటూ పోయినదే ఈ కథా శిల్పమంతా. దేశకాల పాత్రలు మూడింటిలోనూ ఆరామ బ్రహ్మలీలా విభూతిని అడుగడుగునా ప్రదర్శించటమే మహర్షి చేసినపని. చూడండి దానికి తగినట్టు బాలకాండ అంతా ఆయా దేవతల కథలతో నిండి

Page 63

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు