#


Index

కథా సంవిధానము

రామాయణంలో కనిపించేది. కథా నిర్మాణంలో ఇది ఒక చమత్కారం. గొప్ప ప్రౌఢి. మొదటి నుంచీ వింటున్న చూస్తున్న ఈ వ్యక్తులెవరో ఏమిటో వీరి సంబంధం ఎందుకలా పరస్పరం ఘర్షణ పడ్డారని కుతూహలంతో ప్రశ్నించే పాఠకుడికా కుతూహలాన్ని పెంచుతూ పోయి చివరికిదీ వీరి అసలు స్వరూపం, ఇందుకే వీరిలా మొదటినుంచీ ప్రవర్తిస్తూ వచ్చారు, చివరికిలాంటి పరిణామమేర్పడిందని పరిష్కరించి చూపటం ఎంత మనోహరం. ఎంత గొప్ప కళ. ఈనాడు మనం కథలలో నవలలలో నాటకాలలో సినిమాలలో చూస్తుంటాము. suspense అనీ Flash Back అనీ. సస్పెన్సంటే ఏమిటర్ధం. ఇది ఏమిటీ సన్నివేశమెందుకిలా జరుగుతున్నదని ముందుగా చెప్పక చివరదాకా మభ్యపెడుతూ నడపటమేగదా. అదే ప్రస్తుతం రామాయణ కథలో మనకు కనిపిస్తుంది. అలాగే Flash Back అంటే అర్ధమేమిటి. ముందెప్పుడో జరిగిపోయిన వృత్తాంతమంతా తరువాత ఎప్పుడో ఏదో సందర్భంలో బయటపెట్టటం అలా పెట్టేసరి కొక్కసారిగా జరిగిన కథ అంతా మనస్సనే తెరమీద తళుక్కుమని మెరసి పాఠకుడు ముందు వెనుకలు చక్కగా అనుసంధానం చేసుకొంటాడు. ఆ చేసుకోవటంలో ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలుగుతుంది. మామూలుగా కథను నడపటంకన్నా ఇలా నడపటంలో ఒక చమత్కారమూ, కుతూహలమూ, ఆహ్లాదమూ ఉదయిస్తాయి. అంతేగాక ఆ కథ మన మనస్సులో చాలా బలంగా ప్రవేశించి పునః పునః మనకొక అన్వేషణా ఆలోచనా రేకెత్తిస్తూ చిరస్థాయిగా మనసులో నిలిచిపోతుంది.

  ఇంత అధునాతనంగా మనం చూచే ఈ కళాత్మక వ్యవహరమంతా ప్రాచీనమైన గ్రంథంలోనే చోటు చేసుకొని ఉందంటే అది ఎంత గొప్ప విషయం. కాకపోయినా క్రాంతదర్శులు గదా మహర్షులు. వారికి ప్రాచీనమేమిటి నవీనమేమిటి. ప్రాచీనమే నవీనంగా చూపగలరు. నవీనమే ప్రాచీనంగానూ ప్రదర్శించగలరు. వారి బుద్ధి ఒక పరుసవేది. ఒక చింతామణి. ప్రాచేతసుడని పేరందుకే గదా వచ్చిందని చెప్పాము. ప్రాచేతసుడు గనుకనే ఇంత నవీన భంగిమలో నడిపాడు కథా వస్తువును. సీతారామ రావణులే గదా కథలో ప్రధాన వ్యక్తులని పేర్కొన్నాము. ఈ రాముడు విష్ణుదేవుడే అలా అవతరించాడని బాలకాండ ఆరంభంలో ఉదాహరించినప్పటికీ, అది దేవతలకోసమేనని వర్ణించినప్పటికీ అది సూచనా మాత్రసారమే. అందులో ఇంకా

Page 58

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు