#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  అలా దేహాత్మగా మారిపోయిన ట్టేమిటి దాఖలా అని అడిగితే చెబుతున్నాడు. దేహమే నని దీనితో తాదాత్మ్యం చెందటం వల్లనే దేహి అయ్యాడు మానవుడు. దేహం సరిహద్దులు లోనే జీవిస్తుంటాడు కాబట్టి దేహి అని పేరు వచ్చింది. వాస్తవంలో ఈ దేహం లేదు మనకు. దీనితో సంబంధమూ లేదు. దేహమూ దేహి అని పేర్కొనటంలోనే తెలిసి పోతున్నదది దేహః అస్యాస్తితి దేహీ. దేహం కలవాడెవడో వాడు గదా దేహి. కలవాడంటే ఏమని అర్ధం. అది వీడికున్న దనేగాని అదేవీడని కాదు గదా. ఇప్పుడొక పుస్తకం నా చేతిలో ఉందని నన్ను పుస్తకి అనవచ్చు. నేను పుస్తక ధారినే గాని పుస్తకమే నేనవుతానా. పుస్తకమే నేనయితే పుస్తకం ప్రక్కన పెడితే నేను లేకుండా పోవలసి వస్తుంది. పుస్తకం దూరమైనా నా పాటికి నేనుంటూనే ఉన్నాను గదా. అది వినాభావ సంబంధమే Seperable contact గాని అవినాభావ సంబంధం Inseparable contact కాదు.

  అలాగే ఇప్పుడు దేహే కౌమారం యౌవనం జరా ఈ దేహంలో నేను బాల్యాన్ని అనుభవించాను. అది పోయి యౌవనం వస్తే దాన్ని అనుభవించాను. అలాగే ఆ యౌవనం పోయి వార్ధక్యం ప్రాప్తిస్తే దాన్ని అనుభవిస్తున్నాను. బాల్యంపోయి యౌవనం- యౌవనం పోయి జర ఏదీ నిలకడగా ఉండటం లేదు. ఒక దశ పోయి ఒక దశ వస్తున్నది. ఇలా ఆయా దశలు వస్తూపోతూ ఉన్నా దేహి నైన నేను మారటం

Page 57

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు