#


Index

కావ్యసంకేతము

మాపినా తన్ను అంటిపట్టుకొని ఉన్న లక్ష్మణుడనే జీవభావమూ సీత అనే అవిద్యాశక్తి ఉండనే ఉన్నాయి. అవి తమ ప్రభావం చూపకపోవు. వీటి రెంటినీ ఆధారం చేసుకొని విజృంభించింది మరలా తానింతకు ముందుపేక్షించిన కామగుణం. అది మారీచుడి రూపంలో అక్కడే తపస్సు చేస్తున్నది. అంటే నిద్రాణావస్థలో ఉందని భావం. దుష్టప్రబోధం దాన్ని రెచ్చగొట్టింది. రావణవాక్య ప్రచోదితుడై మీదికి వచ్చాడువాడు. ఆ రావణుడికి ప్రచోదన కలిగించింది వాడి చెల్లెలు శూర్పణఖ. దానికి కోపం తెప్పించినవాడు తానే. తన చేష్టితమే. తాను అనవసరంగా కల్లమాటలు చెప్పి దానినేడిపించటంవల్లనే అది రెచ్చిపోయి పరాభవం పాలయి ప్రతిజ్ఞ చేసిపోయింది. దానికి కారణం ఒకటి సీతా సౌందర్యమైతే మరొకటి లక్ష్మణుడు చేసిన కర్ణనాసికాచ్ఛేదనం. అవి తన్ను అంటిపట్టుకొన్న అవిద్యా జీవభావాలే గదా. వాటి నాలంబనం చేసుకునే ప్రలోభ పెట్టాడు మారీచుడనే కాముడు హరిణరూపంలో. మరీచి సంబంధమైనదే మారీచం అంటే మృగతృష్టికే అని అర్ధం. దానికోసం అఱ్ఱులు సాచితన్ను పురికొల్పింది సీత. ఆవిడ మాటలకు వ్యధ చెంది ఆశ్రమాన్ని విడిచివెళ్లాడు లక్ష్మణుడు. తన్మూలంగా చివరకు తన శక్తే తనకు దూరమై పోయింది. అసుర శక్తులకు లోబడి పోయింది. అది కేవలం పార్థివమైనదే కావటంవల్ల కర్మిష్ఠులలాగా దక్షిణంవైపే పయనించింది. అధోలోకాన్నే చెందింది. విద్యావంతుల దేవలోకం దానికి ప్రాప్తించలేదు. కర్మణా పితృలోకః విద్యయా దేవలోకః అన్నారు. దేవలోకం చేరాలంటే ఉత్తరంవైపు పయనించాలి. అది ఊర్ధ్వలోకం. జ్యోతిర్మార్గం. దానికి నోచుకోలేదు సీత. దానికి మారుగా ధూమమార్గంలో దక్షిణానికి ప్రయాణమై అధోలోకమైన లంక చేరింది. సీత అలా వెళ్లిపోవటం లంకలో బందీకావటం ఈ పితృయాణానికి సంకేతమే.

  అయితే శక్తిని కోలుపోయిన జీవుడు పోయిందని ఉపేక్షించటానికి లేదు. శక్తి లేకపోతే అతడొక అంగుళంకూడా స్పందించలేడు. అసలు స్థితికి నోచుకోలేడు. అదే సీతా వియోగంచేత స్తిమితత కోలుపోయి రాముడు వ్యాకుల భావాన్ని పొందటం. ఆ వ్యాకులత్వం తొలగాలంటే మరలా ఆ కోలుపోయిన ఆత్మశక్తిని సాధించి తీరాలి. అది ఎలా సంభవం. ఏ అసురశక్తులు దాన్ని అపహరించాయో వాటిని సమూలంగా నిర్మూలించాలి. అది ఎలాగా. దైవశక్తి అందుకు తోడ్పడాలి. అదే కిష్కింధ చేరి

Page 53

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు