శరీరమూ రెండూ ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ ఈ రెండు శరీరాలలోనూ మరలా అదే జీవరూపంగా వచ్చి ప్రవేశించింది. “సేయమ్ దేవతైక్షత. ఇమాస్తి ప్రోతదేవతా అనేనాత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి”. ఆ దేవత ఆలోచించిందట. ఆ దేవత అంటే ఏ దేవత. కేవల చిన్మాత్రరూపంగా ఉన్న ఆ పరమాత్మ. అది మొదట నిరుపాధికం. సర్వవ్యాపకం. అదే తన సంకల్పంచేత ఈ తేజో బన్నాత్మకమైన అండ పిండ శరీరాలను కల్పించి వీటిలో ప్రవేశించింది. ప్రవేశించే సరికి దేవుడనే పేరు మారిపోయి దానికి జీవుడనే పేరు వచ్చి పడింది. అందులో బాహ్యమైన బ్రహ్మాండ శరీరాన్ని ఆవేశించిన జీవుడు హిరణ్యగర్భుడు లేదా ప్రజాపతి అయితే ఈ పిండ శరీరాన్ని ఆవేశించిన చైతన్య కళ కేవల తైజసుడు. “కారణమ్ గుణ సంగోస్య” అన్నట్టు దీనికంతటికీ ప్రకృతి గుణ సంపర్కమే మూలం. పురుషః ప్రకృతి స్టోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. ప్రకృతి అంటే ఇక్కడ మాయ. మాయతో తాదాత్మ్యం చెంది పురుషుడు మాయాగుణాలైన సత్త్వరజస్తమస్సుల సంవ్యవహారమంతా అనుభవిస్తున్నాడని శాస్త్రం. బాహ్యమైన నామరూపాలతో సంబంధమే సంవ్యవహారం. ఇదంతా తెలిసే తెలియనట్టు ఆచరిస్తే వాడు ఈశ్వరుడని చెప్పాము.
ప్రస్తుతం రామావతారఘట్టమంతా మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ శాస్త్రీయమైన ప్రక్రియే మనకు సాక్షాత్కరిస్తుంది. దశరథుడు అశ్వమేధయాగం చేసిన అనంతరమే పుత్ర కామేష్టి అనుష్ఠించాడు. అలా చెప్పటంలో కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యముంది. అశ్వమంటే కాలానికి సంకేతం. అశ్వంలాగా అనుక్షణమూ నిలవకుండా పరుగెత్తేదేదో అది అశ్వం. కాలమెప్పుడూ అలా పరుగిడుతుంటుంది. మోక్షకాముడైన సాధకుడు దాన్ని మేధం చేయాలి. అంటే వధించాలి. కాలాన్ని జయించాలని అర్ధం. అలా జయించినవాడే పరమాత్మ. కాలాతీతుడాయనే. ఆయనే ప్రస్తుతం దశరథుడికి పుత్రుడుగా జన్మిస్తున్నాడు. అది తేజోబన్నాలనే ఉపాధుల ద్వారానే గదా జరగాలని చెప్పాము. ఆ ఉపాధులకు సంకేతమే యాగాగ్ని ఆ అగ్నిలో నుంచి పాయసకలశంతో ప్రత్యక్షమైన ప్రాజాపత్య పురుషుడూ. అందులో అగ్ని తేజస్సయితే పాయసం అబన్న తత్త్వాలే. మూడింటి సంపుటీకరణం కలశం. దాన్ని ధరించిన ప్రాజాపత్యుడు విరాడ్రూపమైన ఈ బాహ్యజగత్తునంతా ధరించిన హిరణ్యగర్భుడే. యయేదమ్ ధార్యతే అది అందిచ్చిన తేజోబన్నాల మూలంగా మరలా
Page 49