#


Index

కావ్యసంకేతము

తీరుస్తూ పోతుంది. మన మనసు కూడా ఇటు అటూ అలాగే గీతలు గీస్తుంటుంది. సంకల్ప వికల్పాలే ఆ గీచే గీతలు. ఇలా యావజ్జీవమూ గీస్తూ పోవటమే ఈ సీతయొక్క చరిత్ర. ఈ గీతలన్నీ వాటిపాటికి వాటిని స్వేచ్ఛగా వదలిపెడితే అవి ఈ భౌతికమైన ప్రపంచంవైపుకే లాగుకొని పోతాయి మనలను. ఎందుకంటే మనముందున్నది ఈ ప్రపంచమే. ముందున్నది గనుకనే ఇది పౌలస్త్యం. పురస్తాత్తమంటే ముందర అనే అర్ధం. పురాస్తాద్భవమ్ పురస్యం. తస్య సంబంధి పౌలస్త్యం. రలయోరభేదః పురస్సన్నా పులస్సన్నా ఒక్కటే. నిరంతరమూ మనముందు పరచుకొన్నట్టు కనిపించే ఈ ప్రపంచమూ దీనికి సంబంధించిన సమస్త వ్యవహారమూ నని భావం. ఇదే రావణుడు. రావమంటే శబ్దం. శబ్దమయ మీ ప్రపంచం. దశముఖుడు కూడా ఇది. దశావరా విరాట్ విరాడన్నమ్ అని వేదవచనం. దశదిశలా వ్యాపించిన ఈ విరాడ్రూపమైన జగత్తే దశముఖుండే ఇది మనమే మాత్రమేమరి ఉన్నా తనవైపుకే లాగి మన మనస్సును తనకే అధీనం చేసుకొని బాధిస్తుంది. అదే సీతను రావణుడేమరించి ఎత్తుకుపోవటం. అప్పుడీ మనస్సనే సీత రావణుడిలాంటి ప్రపంచంవైపు చరించటమవుతుంది. అది మనకు తీరని ప్రమాదం. దాన్ని వదిలించుకొని బయట పడాలంటే మరలా ఇది రాముడివైపు చరించాలి రాముడంటే ఆత్మాభిరాముడు. తన స్వరూపభూతమైన చైతన్యమేనని భావం. అలా చరించాలంటే ఆ చైతన్యాకార వృత్తే ఆలంబనం. అదే సీత అశోకవనంలో ఉన్నా అనుక్షణమూ రామధ్యానం చేస్తూ కూచోటం. అప్పుడే అది ఆయనను రావణ సంహారానికి పురికొలిపి ఆవిడను చెరనుంచి విముక్తురాలిని చేసింది. దానితో పౌలస్త్యుడివైపు గాక రాముడివైపు చరించింది మరలా సీత. ఇలా రెండువైపులా చరించటమే చరిత్ర. అయితే అది పౌలస్త్యుడివైపు చరించటం బంధకం. రాముడివైపు చరించటం బంధ మోచకం. “మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః” అనే ఈ ద్వివిధ మనోగతిని ధ్వనింపజేయటమే సీతాచరితమని పేరు పెట్టడంలో మహర్షి ఉద్దేశం.

  దీని తరువాత పౌలస్త్యవధ అనే మూడవ నామకరణంలో ఏమిటి వాల్మీకి వివక్షితమని ప్రశ్న. పౌలస్త్యుడంటే ప్రపంచం పురస్త్యమైతే దీనితో ముడిబడ్డ జీవుడు పౌలస్త్యుడు. వాడు రావణుడు. సుఖంలో దుఃఖంలోకూడా కేకలు వేసే స్వభావం గలవాడు. సుఖంలో ఉత్సాహంతోనైతే దుఃఖంలో నిరాశతో, దశేంద్రియాలతో

Page 43

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు