రూపిణిఅయిన సీత. ఆ పిమ్మట రాముడూ అని అటునుంచి ఇటు త్రిప్పి చూచినా సరిపోయే వ్యవహారమే. అంటే రావణవధ ఆ వధకోసం సీత చరిత్ర ఆ చరిత్రకు మూలమైన రామ జననమూనని భావం.
అంతేకాదు. ఇంతవరకూ మనం వర్ణించినదంతా సాహిత్యపరమైన బాహ్యార్ధం. పోతే ఇంతకు మించిన ఆధ్యాత్మిక రహస్యం కూడా ఎంతో గుప్తమయి ఉంది మహర్షి నామకల్పనలో. అది రామపరంగా ఒకటి. సీతాపరంగా ఒకటి. రావణ పరంగా ఒకటి. త్రిపథగలాగా మూడు మార్గాలలో ప్రసరిస్తున్నది. మూడు దృష్టులు పెట్టుకొని చూడాలి దాన్ని. చూస్తే మనకది ముమ్మూర్తులా సాక్షాత్కరిస్తుంది. మహర్షి కథా నిర్మాణంలోని హృదయమిది గదా అని హృదయానికి ప్రకాశమిస్తుంది. మొదట రామపరంగా చూతాము. రామపరంగా చూస్తే అది రామాయణం. రామ అయన ఈ రెండు మాటలూ కలిసి రామాయణమయింది. అయనమంటే గమనం దక్షిణాయనం ఉత్తరాయణమని వ్యవహరిస్తుంటాము. ఏమిటక్కడ అయనమంటే. సూర్యుడు దక్షిణంవైపు ఉత్తరం వైపు చేసే ప్రయాణమే గదా. అలాగే ఆత్మారాముడైన ఆ పరమాత్మ కూడా తన విభూతిని చూపదలచి లోకంవైపు పయనం సాగించాడు. అదే రామాయణం. అయితే ఎందుకీ పయనం. ఏమిటి దాని ప్రయోజనం. ధర్మ సంస్థాపనార్ధాయ అన్నట్టు ధర్మసంస్థాపనమే ప్రయోజనం భగవదవతారానికి. అది ఎలా సాధ్యం. దుష్టశిక్షణ శిష్టరక్షణ మూలంగా శిష్టమైనదేది ఇక్కడ. సీతా చరిత్ర అది దుష్టుడైన రావణుడి చెరలో చిక్కింది. అంచేత ఆ చెరనుంచి విడిపించాలి ఆ చరితాన్ని, విడిపించాలంటే దుష్టుడైన పౌలస్త్యుణ్ణి వధించే తీరాలి. అందుకోసమే రామాయణం. అంటే రామావతారం.
పోతే ఇక సీతాపరంగా ఏమిటి కవి వివక్షితం. సీతా చరితమని గదా నామధేయం. సీత భూజాత అంటే భూమినుంచి జన్మించిందని అర్ధం. భూగర్భజాతుడే మానవుడు కూడా. మానవుడి శరీరమేకాదు. అతడి మనస్సు కూడా పార్థివమే. అన్నమయమ్, సోమ్యమనః అని శాస్త్రం. మనస్సనేది అన్న వికారమట. అన్నమంటే ఈ పృథవీతత్త్వమే. కాబట్టి మన శరీరమూ మన మనస్సూ ఇవి రెండూ భూమి నుంచి జన్మించినవే. ఇదే సీత. ఈ మనస్సే. సీతాలాంగల పద్ధతిః అని నైఘంటుకుల వచనం. సీతా అంటే నాగేలి చాలు. నాగలి ఒక పొలంలో అటూ ఇటూ రేఖలు
Page 42