#


Index

కవి మాహాత్మ్యము

రామాయణ కావ్యంమీద ఎంత మమకారమెంత గౌరవమో చెప్పలేము. "వాల్మీకి గీత రఘుపుంగవ కీర్తిలేశైస్తృప్తిమ్ కరోమి కథమప్యధునా బుధానామ్" వాల్మీకి రామాయణమొకటి ఉండగా మరలా నీవెందుకయ్యా రామాయణం చంపూ రూపంగానైనా వ్రాయటమని అడిగితే అయ్యా క్షమించండి. నిజానికి వ్రాయనక్కర లేదు. ఆ మహర్షి రామ కథాగానం అమోఘంగా చేశాడు. అపారవారంగా ప్రవహించే ఆ గానామృత ప్రవాహంలో ఒక కణాన్ని సంగ్రహించి దానితో నేనూ గానం చేయాలనిపించింది. చేస్తున్నాను. ఇది ఎలాంటిదంటే “గంగా జలైర్భువి భగీరథ యత్నలభైః కిమ్ తర్పణమ్ సవిదధాతి జనః పితౄణామ్” గంగను భగీరథుడే తెచ్చాడు భూమికి. మరెవరూ కాదు. కాని ఆ గంగాజలాన్ని అందరూ స్నానపానాదుల కుపయోగించుకోవటం లేదా అలాగే ఆ మహాకవి కవితామృత పూరంలో ఒక పుడిసెడు సేకరించి మేమూ మీబోటి రసజ్ఞులకు విందుచేయాలని ఉందని పలుకుతాడు. చూడండి. ఎంత వినయమో వాల్మీకి అంటే భోజుడికి. కారణమేమంటే మహర్షి మహర్షే మేము మేమే. “అథసర సిజయోనే రాజ్ఞయా రామవృత్తమ్ కరబదర సమానమ్ ప్రేక్ష్యదృష్ట్యా ప్రతీచ్యా శుభమతనుత కావ్యమ్ స్వాదురామాయణాఖ్యమ్” సాక్షాత్తూ బ్రహ్మదేవుడే దిగి వచ్చి వ్రాయమని కోరితే వ్రాసిన వాడాయన రామాయణం. అది కూడా తపశ్శక్తి సంపాదితమైన ప్రత్యర్థృష్టితో చూచి రచించాడు. అందుకే అది శుభమూ, స్వాదువూ. దానివల్లనే మధుమయ ఫణితీనామ్, మార్గదర్శీ మహర్షిః, మధుమయమైన వాక్కులకాయన తరువాతి కవుల కందరికీ మార్గదర్శకుడయ్యాడని పొగుడుతాడు.

  మరి మురారి అయితే ఎంతగా మురిసిపోతాడో వాల్మీకి అంటే. ఎంతగా మురిశాడంటే బాలవాల్మీకి అంటూ తనకు తానే ఒక బిరుదు తగిలించుకొన్నాడు. పోతే తన్ను లాలించే ప్రౌఢ వాల్మీకి ఎలాంటి వాడతని దృష్టిలో “చేతశ్శుక్తికయానిపీయ శతశః శాస్త్రామృతాని క్రమాద్వాంతై రక్షరమూర్తిభి స్సుకవినా ముక్తాఫలైర్గుంభితాః ఉన్మీలత్కమనీయ నాయకగుణగ్రామోప సంవర్గ ప్రౌధాలంకృతయోలుఠంతు సుహృదామ్ కంఠేషు హారస్రజః” మనోవిజ్ఞానమనేది ఒక శుక్తిక అట. ముత్యపు చిప్పలో నీరు పడ్డట్టే దానిలో పడిపోయాయట ఎన్నెన్నో శాస్త్ర జలప్రవాహాలు. అలా పడిపోయిన ఆ శాస్త్రజలాలన్నీ క్రమంగా వర్ణపద వాక్యాలనే ఆణిముత్యాలలాగా

Page 35

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు