#


Index



ప్రత్యాలోకనము

సంకేతం తనకు స్వార్ధమంటూ ఏఒక్కటీ లేదా మహానుభావుడికి. అర్ధానికి, కామానికి చివరకు ధర్మానికీ కూడా అతీతమై కడపట పరమ పురుషార్ధమైన మోక్షానికే బారలు సాచిన పావనమైన జీవిత మాపావనిది.

  విభీషణుడిది ఆయనదీ ధార్మికమైనదే అయినా విభీషణుడు ధర్మం వరకే వచ్చి నిలిచిపోతే హనుమంతుడు ధర్మాన్ని ఎంతగా పాటించవలెనో అంతగా పాటించి దాని కతీతమైన మోక్షాన్ని కూడా అందుకొన్నాడు. అందుకే రాముడాయన కేదీ ఇవ్వట మిష్టంలేక కేవలమాలింగనం మాత్రమే చేసుకొంటాడు. ఈ ఆ లింగనంలో ఎంతో ఉన్నదంతరార్ధం. పరమాత్మ ఆలింగనమంటే అది సామాన్యంకాదు. తాంత్రిక భాషలో మాట్లాడితే అది పరాశక్తి పాతం. పరమ యోగులకే లభించే మహాభాగ్యమది. మరి శ్రీరాముడు చివర నీకేమి కావాలని అడిగితే నాకివి ఏమీ అక్కరలేదు ప్రభూ! నీ యెడ నాకు అచంచలమైన భక్తి ఒకటి ఉంటే చాలు. అది అనుగ్రహించమని కోరుతాడు. భక్తి ఉంటే చాలు. నిజానికందులోనే ఉంది సమస్తము ఏమిటి భక్తి అంటే. స్వస్వరూపాను సంధానమ్ ముక్తి రిత్యభిధీయతే అని జగద్గురువులు చెప్పినట్టు స్వస్వరూపాను సంధానమే. ఎక్కడ ఉందది. మనలోపలా మనవెలపలా సర్వత్రా. మనమూ మనం చూసే జగత్తు మన కతీతంగా ఉన్నదనుకొనే ఒక ఈశ్వరుడు, ఇవి మూడు కలిసి ఒకే ఒక రూపం అది నా రూపమే అని భావించటమే స్వరూపానుసంధానం. ఇదే అసలైన సిసలైన భక్తి. అనన్యమైన భక్తి. అదే జ్ఞానంకూడా. ఆ జ్ఞానంతో కర్మ చేస్తే అది కర్మయోగం. చేయకుంటే అది జ్ఞానయోగం. ఇలాంటి కర్మ జ్ఞాన సమన్వయ రూపమైన పవిత్ర జీవితమెలా ఉంటుందో చూపటమే ఆంజనేయుని పాత్ర.

  ఏతావతా తేలిన సారాంశమేమిటి ? మహాకవి లోకానికిచ్చే సందేశమేమిటి? కామమయమైన జీవితాన్ని, కామదూరమైన ధార్మిక జీవితాన్ని దానికి కూడా అతీతమైన ఒక మహాభాగవత జీవితాన్నీ ఎలా ఉంటుందో లోకులకు చాటి చెప్పటమే. ఇదంతా ఆయన చాటే నీతి అయితే దీని నా పరమాత్మ భూతిలేదా విభూతిగా భావించి దానితో కూడా మేళవించి కావ్యమార్గంలో రమణీయంగా దాన్ని ధ్వనింప జేయుట మింకా శోభ తెచ్చిందా సందేశానికి, రాముడు దశరథ రాముడై జన్మించాడే గాని నిజంలో ఆత్మారాముడే గదా. ఆయన ఆత్మ స్వరూపుడైతే ఆయన నాశ్రయించిన

Page 333

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు