తీరా వారు తీరిపోయేసరికి కన్ను తెరచి కూడా ఒకదానికి మరలా ఆ కామంతోనే కన్నులు మూతపడితే మరొకతి అలా జరగకపోయినా కలలాగా కరిగిపోయిన ఆ కామమయి జీవితానికే కలవరిస్తూ జీవిత శేషం గడిపింది.
ఇంతకూ సీతారాములలాగా ధర్మావిరుద్ధమైనా దశరథాదులలాగా ధర్మ విరుద్ధమైన దాంపత్య జీవనమెంత అనుకూలమైనా ఎంత ప్రతికూలమైనా కామమనేది అత్యంతంగా అనుచితంగా సేవిస్తే అది ఎప్పటికైనా దెబ్బతీసే వ్యవహారమే. దీనికి నరుడనీ, వానరుడనీ, దానవుడనీ ప్రశ్నేలేదు. అందులో స్త్రీ అని పురుషుడని వివక్ష లేదు. అది తాత్కాలికంగా సుఖమిచ్చినా చివరకు ముప్పు తెచ్చెదే. ఈ జీవిత సత్యాన్ని లోకానికి చాటటానికే దాని విశ్వరూపాన్ని కథా ముఖంగా ఆయా పాత్రల ముఖంగా కావ్యమర్యాదలో ప్రదర్శించి చూపాడు మహాకవి. రామాయణ కథ అసలు ఆద్యంతాలు ఈ భావంతోనే వ్యాపించి ఉంది. ఆయా సన్నివేశాలు, పాత్రలు, వారి ప్రవృత్తులు కేవల మీభావాన్ని ఆవిష్కరించటాని కేర్పడ్డ సంకేతాలే. సీతారాములైనా సంకేతమే. కైకేయి దశరథులన్నా సంకేతమే. తారావాలులన్నా అదే. మందోదరీ రావణులన్నా అదే. తుదకు శూర్పణఖదీ అదే కాకాసురుడిదీ అదే అసలీ కామ పురుషార్ధము దీని అనుచిత సేవనంవల్ల కలిగే అనర్ధము ఎలాంటిదో కావ్యముఖంలోనే సూచించాడు మహాకవి. అదే గదా మానిషాద అనే శ్లోకం. ఆ శ్లోకానికి వ్యాఖ్యానమే రామాయణ మహాకావ్యం. అది బీజమనుకొంటే కథ అంతా దాని నుంచి ఆవిర్భవించిన శాఖోపశాఖాత్మకమైన ఒక మహావృక్షం.
శాఖోపశాఖలన్నందు కిందులో మరొక చిత్రం కూడా చూడవచ్చు మనం. కొందరి దన్యోన్య నిష్ఠమై దెబ్బ తింటే కొందరిదే కనిష్ఠమై తిన్నదా కామం. ఒకచోట స్త్రీగతమై పురుషగతం కాక దెబ్బతీస్తే మరొక చోట పురుష గతమై స్త్రీ గతం కాక ముప్పు తెచ్చింది. స్త్రీ గతంలో కూడా మొదట ఒక పురుషుణ్ణి ఆశ్రయిస్తే తరువాత మరొక పురుషుణ్ణి భజించేలాగా చేసింది. ఇవన్నీ సంకేతాలే ఆలంబనాలే మహాకవికి. ఎన్నివిధాల ప్రసరిస్తుందో ఎన్ని అనర్ధాలను ప్రసవిస్తుందో చూడండి కామపిశాచి అని మనబోటి లోకులకు భంగ్యంతరంగా చాటటమే ఇది. అయితే ఒకమాట అడగవచ్చు మనం. కామమనేది కూడా పురుషార్ధాలలో ఒకటి గదా. అది అంత హేయమని భావించటం దేనికి. వాస్తవమే, పురుషార్ధమే కావచ్చు. కాని అది ఐహికమే.
Page 331