పతిధర్మాను వర్తమెలాంటిదో ఒకరు చెప్పనక్కరలేదంటుంది సీత. వారి మాట జవదాటే ప్రశ్నేలేదసలు వారి మాట మీదనే చేసుకొన్నవారు గనుకనే ఒకరికొకరు ప్రతిక్షణ ప్రవర్ధమాన ప్రీతిపాత్రులయినారు. ఎంత అవినాభావమంటే వారి దాంపత్య జీవితం, నగరంలోనైనా అరణ్యంలోనైనా బిగ్గరగా వాపోతాడు రాముడు. సరమ కాదు. త్రిజట కాదు. హనుమంతుడే కాదు. ఎవరి వద్దనైనా గోడుగోడున విలసిస్తుంది సీత. నహ్యహం జీవితుం శక్తస్సామృతే జనకాత్మజామ్ అని ఆవిడ లేకుండా బ్రతకటమే భారమయింది ఆయనకు. దిజ్మామనార్యా మనతీమ్ - యహంతేన వినాకృతా ముహూర్త మపి రక్షామి జీవితం పాప జీవితా అని అన్ని రోజులు తాను బ్రతికి ఉన్నందుకే సిగ్గుపడుతున్న దావిడ. వారివురూ అసలొకరి నొకరు విడిచి ఎలా బ్రతకగలిగారా అని ఆ జన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుడే ఆశ్చర్యపోతాడు. అయినా బ్రతుకుతున్నారంటే అస్యాదేవ్యా మనస్తస్మిన్ - తస్య చాస్యామ్ ప్రతిష్ఠితమ్ తేనేయం సచ ధర్మాత్మా - ముహూర్త మపి జీవతి. ఈమె మనస్సాయనలో ఆయన మనస్సీమెలో బాగా నాటుకొనిపోయి ఉంటుంది. కనుకనే ఈ మాత్రమైనా ప్రాణాలు నిలుపుకో గలిగారంటాడు. ఇంత ఆదర్శప్రాయమైన గొప్ప అనురాగమా దంపతులది. వియోగంలో సంయోగంలో ప్రత్యక్షంలో పరోక్షంలో కూడా ఎంతో అంతశ్శుద్ధిని సంతరించుకొన్నదీ నరవానర దానవదైవత ఋషివరులందరిచే ఎన్నో ప్రశంస లందుకొన్నదీ సందేహం లేదు.
అయితే అతి సర్వత్రవర్జయేత్తన్నట్టు అనురాగమనేది కూడా పరాకాష్ఠకు పోరాదు. ఎంత ప్రశంసనీయమైనా అది కేవలం స్త్రీ పురుష వ్యవహారమే. ఎంత మానసికమైనా దానితోపాటు శారీరక వాసనావాసితమే. పతనాంతాస్సముచ్ఛయా అని కథానాయకుడే వాక్రుచ్చాడొకచోట. ఏ భావమైనా ఎంత పైకి పోతుందో అంత క్రింద పడక తప్పదు. ప్రణయం కూడా ఒక భావమే. మనోవికారమే. మితిమీరి సేవిస్తే అదికూడా మానవుణ్ణి దెబ్బతీస్తుంది. ఈ మాట లక్ష్మణుడే అన్నాడు తన అన్నగారి ననునయిస్తూ అతిస్నేహ పరిష్వంగా ద్వర్తిరార్ధాపిదహ్యతే. అతిస్నేహం వల్ల ఒక వత్తి తడిసి ఉన్నా దహింపబడుతుందట, ఎంత గొప్ప భావమో ఎంత మనోహరంగా ఆవిష్కరించాడో చూడండి మహాకవి. తడిసిన పదార్ధమెలా దహించబడుతుంది. అలా జరగటానికి వీలులేదు. అయినా వత్తి తడిసి కూడా
Page 326