నిర్మాణం ద్వారా చాటుతున్నాడు వాల్మీకి భగవానుడు కూడా. వేదవేద్యేపరే పుంసిజాతే దశరథాత్మజే అని గదా అభియుక్తోక్తి. ఆత్మారాముడే దశరథ రాముడై ఆ రామ జీవితమే కావ్యారామంగా పరిణమించినప్పుడవి రెండే గదా మనమిక ఆస్వాదించే ఫలాలు. దశరథ రాముడుగా నీతి బోధిస్తే- ఆత్మారాముడుగా భూతినే ప్రసాదించాడు. దానితో శ్రోతల కైహికాముష్మికాలు రెండూ ఫలించక తప్పదు. అప్పుడే అది పరిపూర్ణత జీవితానికి.
ఇందులో నీతి అనే శేవధి నెలా మనకందిస్తున్నదో చూతాము రామాయణ రత్నాకరం. నీతి అనేది ఒక తీరుగాదు. తెన్నుగాదు. అనేక భంగిమలలో నడుస్తుంటుంది. అది లోక నీతి కావచ్చు. రాజనీతి కావచ్చు. వైయక్తికం కావచ్చు. సామాజికం కావచ్చు. హేయమూ ఉంటుందందులో. ఉపాదేయము ఉంటుంది. రెంటినీ వర్ణిస్తాడు చిలువలు వలువలుపెట్టి మహాకవి. అయితే రెంటినీ పరిగ్రహించమని చెప్పటానికిగాదు. ఒకటి పరిగ్రహించమనీ, మరొకటి పరిత్యజించమని చెప్పటానికి. రెంటినీ అంతగా వర్ణించి వాటివల్ల కలిగే శుభాశుభపరిణామాలను కూడా వర్ణించి చెబితే గాని మనమది కాదని త్రోసిపుచ్చి ఇది అవునని ఆదరించబోము. శాస్త్రంలో దైవాసుర సంపదలను వర్ణించినట్టే కావ్యంలో కూడా ఈ రెంటినీ వర్ణించటంలో తాత్పర్యమిదే. వాటినలాగే వివేచన చేసి చూడాలి మనం. చూడటమే గాక చూచి ఉపాదేయమైన నీతి మార్గాన్ని పట్టుకొని హేయమైన అవినీతిని ప్రక్కకు నెట్టగలగాలి. అందుకే కథలో ప్రతిపాత్రలో వారి ప్రవృత్తిలో రెండు భావాలనూ కలగలిపి సృష్టించాడు మహర్షి. అది ఇంతకుముందే ఆయా పాత్రల చిత్రణంలో మనం కొంతకు కొంత దర్శిస్తూనే వచ్చాము. ప్రస్తుతమది ఇంకా కొంత లోతుకు దిగి చూతాము.
చూడండి నీతికిగాని, అవినీతికిగాని ఆశ్రయమెవరు లోకంలో. స్త్రీ పురుషులిద్దరే. స్త్రీ పుంస యోగోద్భవమే గదా ఈ లోకమంతా. వారి సహజీవనమే దాంపత్యం. సమాజ వ్యవస్థ కంతటికీ అదే పునాది. అలాంటి ఉత్తమ దాంపత్య జీవితాని కుదాహరణ భూతులే సీతారాములు స్వయంవరంలో గెలుపొందినా స్వతంత్రించి చేసుకొన్న వివాహంకాదు వారిది. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో జరిగినది. జననీ జనకులంటే ఇద్దరికీ ఎనలేని గౌరవం. మా తల్లిదండ్రులే బోధించారు నాకు
Page 325