ప్రత్యాలోకనము
మనమింతవరకూ రామాయణ రామణీయకాన్ని ఎంతగా ఆలోకనం చేయాలో
అంతగా చేశాము. రామాయణ కవి దగ్గరనుంచీ రామ రావణ సంగ్రామందాకా
సాగింది మన ప్రయాణం. సాయుజ్యంతో సమాప్తమయింది. రామాయణ స్రష్ట
వాల్మీకి మహర్షి అయితే ఆ స్రష్ట సృష్టించిన కావ్యానికి ద్రష్టల మనిపించుకొన్నాము
మనం. ద్రష్టలంగా ఏమిటి మన మాదర్శించిన సత్యం అదే జయం. జీవితానికే
జయం. ఈ జయం కథా జీవితంలో రావణుడికైతే జీవిత కథలో మనందరిదీ. ఇది
ప్రసాదించిన వాడక్కడ రాముడైతే ఇక్కడ మనకు వాల్మీకి మహర్షి. మహర్షి గనుకనే
భగవానుడిలాగా క్రాంతదర్శి ఆయన. జ్ఞానదీర్ఘమైన ఆజ్ఞాన చక్షుస్సుతో ఏ జీవిత
సత్యాన్ని ఆయన దర్శించాడో మొదట దానినే అత్యంత రమణీయంగా ప్రదర్శించాడొక
అద్భుతమైన కావ్యరూపంగా. అదే రామాయణం. లోకాభి రామాయణానికి
లోకోత్తరంగా కల్పించిన ఒక సాహితీ సంకేతం. సాహిత్యమంతా సంకేతమేనని
గదా మొదటి నుంచీ మనవాదం. సంకేతం భౌతికమైతే అందులో పొదిగిన సత్యం
మన కభౌతికంగా దర్శనమిస్తుంది. ఈ సంకేతం ద్వారా ఆ సత్యాన్ని అందుకోవటమే
మనం చేయవలసిన యత్నం. దానికి చేయూత నీయటానికే మహాకవి
బాహ్యాభ్యంతరాలనే రెండు భూమికలలో తన కథావాహిని ప్రవహింపజేస్తాడు. మనము
ఆ ప్రవాహాన్ని అలాగే అందుకొని దానిలో అవగాహన చేయాలి. స్నానంతోపాటు
రసపానం కూడా చేయగలగాలి. రసస్ఫోరకమైన ఇలాంటి ఇంద్రజాలాన్ని ఒక
వాల్మీకి ప్రదర్శించాడు. ఒక వేదవ్యాసుడు ప్రదర్శించాడు. ఇది ఇంద్రజాలమైతే
అది ఇంకా మహేంద్రజాలం. మరి దాని మహత్త్వమెలాంటిదో దర్శించాలంటే
దీని వెంటనే వెలువడబోయే మహాభారత వైభవమనే గ్రంథంలో మనోనయనానంద
కరంగా దర్శించవచ్చు సహృదయ ప్రేక్షకులు.
కాగా ప్రస్తుత మీ రామాయణ కావ్యసంకేతం ద్వారా వాల్మీకి మహర్షి లోకాని కందిస్తున్న ఆ దివ్య సందేశమేమిటి ? ఆ జీవిత సత్యమేమిటని మనం ప్రత్యాలోకనం చేయవలసి ఉంది. జీవిత సత్యం మానవజాతికి భౌతికంగా నీతి అయితే అధ్యాత్మికంగా భూతి అని చాటాడు భగవానుడు గీతా ఫలశ్రుతిలో. అదే తన కావ్య
Page 324