#


Index



ప్రత్యాలోకనము

కాలుతున్నది. అది ఎలాగంటే చెబుతున్నాడు సబబు అతిస్నేహం వల్లనని స్నేహమంటే ఇక్కడ తైలమని అర్ధం. తైలంలో తడవటంవల్ల ఆతడి అది కాలటానికే దోహదం చేసింది. అలాగే స్నేహమంటే అనురాగమని కూడా అర్ధమే. ఆ స్నేహంతో ఆర్థమయినందు వల్లనే కాముకుడి హృదయం కూడా కాలిపోతుంది. అని మందలిస్తాడు. ఇది రాముడికి కాదు. లోకానికంతా చేసిన గొప్ప మందలింపు. నీ భార్య రూపవతే కావచ్చు. గుణవతే కావచ్చు. ఆవిడంటే నీకనురాగముండవచ్చు. ఆవిడకు నీమీద వల్లమాలిన ప్రేమ ఉండవచ్చు. కాని అదేగాదు పరమార్ధం. కేవలమది వైయక్తికమే. వైయక్తికమంతా సంకుచితమే. అది అంతకంతకు భావవికార మాపాదించి సుఖశాంతులకు నిన్ను దూరం చేస్తుంది. ఇదే చూపాడు మహర్షి వారి జీవితంద్వారా లోకానికి.

  ఇలాంటి భావవికారమే రేకెత్తించింది నిజానికి సీతారాముల ప్రణయాతిరేకం. అది సీతలో ఒక అనుమాన రూపమైన చాపల్యానికి, రాముడిలో ఒక అత్యాగ్రహానికి దారితీసింది. చాపల్యము, అనుమానము ఒక్కటే. చాపల్యమంటే చంచలమైన స్వభావం. అటూ ఇటూ కదిలే లక్షణం. అనుమానమన్నా అదే. ఒక నిశ్చయమనేది అటూ ఇటూ పరిభ్రమిస్తూ నిలకడ కోలుపోవటమే గదా. అది సీత స్వభావంలో మొదట నుంచి చూపుతూ వచ్చాడు మహర్షి వల్లభుడిమీద ప్రేమ ఎక్కువైన కొద్దీ వల్లమాలిన అనుమాన మావిడకు. అడవికి ఒంటరిగా పోతున్నాడేమవుతుందో నని అనుమానం. అందుకే అతడు వద్దన్నా అక్కడ ఎంతో కష్టమని బెదిరించినా వినకుండా బయలుదేరింది. అక్కడ నీకీ ధనుర్బాణాలెందుకని నిష్కారణంగా వైరంకొని తెచ్చుకుంటాడని ముందుగానే సందేహిస్తుంది. కనకమృగమనేది ఒకటి ఉండదని తనకు తెలిసి కూడా అది రాక్షసమాయ అని లక్ష్మణుడు హెచ్చరిస్తున్నా వినక దానినే పట్టి తెమ్మని కేవలం పసిపిల్లలాగా చాపల్యాన్ని చూపుతుంది. అది హా ! రామా అని అరవగానే మరలా తన రాముడి కేమయిందో నని కీడు శంకించి మరదిని నానామాటలని దూరంగా తరుముతుంది. పెనిమిటి ఎంత పరాక్రమవంతుడో తనకు తెలియదా అంతకుముందే గదా ఖరదూషణాదులను శరదూషితులను చేయటం చూచింది తాను. అయినా దేనికింత అనుమానం. అలాగే తరువాత అశోకవనంలో ఒంటిగా కూచొని శోకిస్తూ తన భర్త ఆపాటికి బ్రతికి

Page 327

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు