కీడుచేసి నీవు నేను బ్రతకటానికేనా ? సీత నొప్పగించకపోతే మన వంశానికే అది కట్ట కడపటి ఘట్టమని ఎంతగానో నచ్చజెప్పాడు. అయినా పెడచెవిని బెట్టాడు. చివరి క్షణంలో తన తాత మాల్యవంతుడు కూడా ఇది కూడదని సంధి చేసుకోమని హితోపదేశం చేశాడు. ఆలకించలేదు. మరి మందోదరే ఆక్రందన చేసింది. తానంతకు ముందెన్నో మార్లు మనవి చేశానని. అదికూడ పాటించినవాడు కాడు.
ఏమిటీ మొండితనం. ఎందుకని. ఎందుకేముంది. పైకి మొండిగా కనిపిస్తున్నా
అది వైరంలో ఉన్న మొండితనంకాదు. వైరభక్తిలో భక్తికూడా ఒక విధమైన
మొండితనమే. అంత మొండితనం మకురుతనం చూపితేగాని భగవానుడి దృష్టిని
తనవైపు త్రిప్పుకోలేడు. ఆయన కాగ్రహం తెప్పించలేడు. తద్వారా తన అసురజన్మ
కడతేర్చుకొని పోలేదు. అదేగా ఇప్పుడీ దానవ భక్తుడికి పట్టుకొన్న బాధ. ఎప్పుడో
శాపగ్రస్తుడై వచ్చి పడ్డాడీ కర్మ భూమిలో తగులుకొన్నాడీ తామసోపాధిలో. దీని
బంధం నుంచి మరలా బయటపడటమెలాగ ? అది శుద్ధ సత్త్వోపాధిని మరలా
సాధిస్తే గాని సంభవం కాదు. అప్పుడే వైకుంఠ ప్రాప్తి తనకు మరి ఈ శుద్ధసత్త్వమెలా
అబ్బుతుంది. రజస్తమస్సులనే మబ్బు వదలి పోవాలి మొదట. అందుకే పరమాత్మ
ఎదుటపడకుండా అంతదనుకా ఆయనకు కినుక పుట్టే పనులు మొదలుపెట్టాడు.
తన అసురశక్తుల నన్నిటినీ ఆయన సంహరిస్తూ వచ్చాడు. తాటకాదులను పంపాడు.
వారిని చంపి ఒక్క మారీచుణ్ణి ఒప్పజెప్పాడు. శూర్పణఖను పంపాడు. ముక్కు
చెవులు కోసి దాని నప్పగించాడు. మారీచుణ్ణి మాయా మృగం చేసి ముందుకు
తోశాడు. తాను దానిని తన బాణాగ్నిలో పేల్చి దాని అసలు రంగు బయట
పెట్టాడాయన. ఆయన శక్తినే దొంగిలించుకొని పోతూ దారి పొడుగునా ఆనవాళ్లు
చూపుతూ పోయాడు తాను. ఆయన దాని గుర్తులు పట్టుకొని పోయి తన అసుర
బలానికి శాత్రవమైన దేవసైన్యానికి ప్రతినిధి నొకణ్ణి తన దగ్గరికి పంపాడు. అతడి
తోకకు తాను నిప్పు పెడితే తన పట్టణానికే ఆయన నిప్పు పెట్టించాడు. తానాయన
చూపులకందకుండా దాచి ఉంచిన శక్తి నాయన చారముఖంగా చూడనే చూచాడు.
సరే సముద్రం దాటి వచ్చినాడిక చూతామనుకొంటే దాటి రానేవచ్చాడాయన. ఏదో
కొంత సత్త్వగుణంతో తపశ్శక్తిఉందిగదా ఏమి చేయగలవని మౌనంగా ఆయనను
హెచ్చరిస్తే విభీషణ దూషణవ్యాజంతో ఆయన మౌనంగానే దాన్ని తనకు దక్కకుండా
Page 320