#


Index



రామ రావణులు

దేవదేవుడు. తప్పకుండా తన అసుర మాయను భేదించటానికి దైవబలంతో తనమీదకి వస్తాడు. తన అసురబలాలెన్ని అడ్డు వచ్చినా లెక్క చేయడు సముద్ర మధ్యంలో పర్వత శిఖరంమీద అభేద్యమైన కోటలోనే తాను కాపురమున్నా దానిని రూపుమాపగలడు. అది ఎలా చేయగలడో చేసి తన అసురోపాధిని దూరం చేసి మరలా తన సహజమైన శుద్ధ సత్త్వోపాధి తనకెలా ప్రసాదించగలడో ప్రసాదించి తన్ను మరలా సర్వశక్తుణ్ణి చేసి తనకు జయుడనే పేరు సార్ధకం చేయగలడో ఆ ప్రక్రియను పరిశీలిద్దామనే అతడి కుతూహలం. ఆ వేడుక తీర్చుకోవాలనే ఈ సీతాపహరణమనే వేడబం.

  వేడబం కాకుంటే చూడండి. ఆవిడను కొనిపోతే సర్వనాశనమవుతావు. నీకు రాముడంటే ఎవడో తెలియదు. నా మాట విను నాకెంతో అనుభవమని తన పూర్వానుభవం చెప్పి మారీచుడెంత వాపోయినా వినిపించుకోకుండా సీతను బలవంతంగా తీసుకువచ్చాడు. అలా తెస్తున్నప్పుడు, తెచ్చిన తరువాత ఆవిడ తనకు నయాన భయాన ఎన్నివిధాల ఎంత నిష్ఠురమాడి బోధించినా వినిపించుకోలేదు. తరువాత ఆవిడను చూడటానికి హనుమంతుడు వచ్చి లంకిణిని చంపాడని తెలుసు. తన అశోకవనాన్ని భగ్నం చేశాడని తెలుసు. తన్నిమిత్తంగా రాక్షస వీరులను పంపితే అక్షయకుమారుడితో సహా అందరినీ చిత్తుచేశాడనీ తెలుసు. ఇంద్రజిత్తు చేత చిక్కినట్టు నటించినా రామదూతనని చెప్పుకొంటూ వచ్చి సీత అంటే ఎవరనుకొంటున్నావు. కాళరాత్రి. నీ మెడకు చుట్టుకొన్న కాలపాశం. దానితోనే నీవు హతమవుతావని ఎంత హెచ్చరించినా వినలేదు. తుదకతని తోకకు నిప్పుపెట్టి అతడు దానితోనే లంకకంతా నిప్పుపెట్టి కుప్పకూలిస్తే కూడా జంకలేదు. ఆ మీదట వానర సైన్యంతో రాముడు వచ్చాడు. సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశించాడు. ఇక తనమీద పడటానికి సిద్ధంగా ఉన్నాడు. శుకసారణులు వచ్చి విషయం చెప్పారు. అంగదుడు చివరిసారిగా వచ్చి ఆయన భార్య నాయన కప్పగించి ప్రాణాలు తప్పించుకోమని హెచ్చరించి వెళ్లాడు. దానికి భయపడలేదు. ఆఖరుకు తన తమ్ముడు తనకు రెండుమార్లు హితం చెప్పాడు. సీతను తెచ్చినప్పటి నుంచి తన రాజ్యంలో ఎన్ని ఉత్పాతాలుసంభవించింది ఏ కరువు పెట్టాడు. రాముడంటే ఏమనుకొన్నావో. నిన్ను ముప్పుతిప్పలు పెట్టిన వాలి నొక్క కోలతో కూలనేసిన మహావీరుడు. ఆయనకు

Page 319

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు