#


Index



రామ రావణులు

  అయినా శక్తిహీనుడిప్పుడు తన స్వామి. తానో ఆ శక్తిని కొని తెచ్చిన శక్తిమంతుడు. తన్నా స్వామి ఏమి చేయగలడో చూద్దామని అతని బరవసా కాని ఆ కొని తెచ్చాననుకొన్న శక్తిదైవశక్తి తానా ఒక అసురుడు. అసురోపాధిలో జన్మించి తాను దైవశక్తిని వశీకరించుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ ఆశతోనే ఆవిడను బలాత్కరించి తెచ్చాడు. అది వట్టి ఆడియాస. ఈ అసురోపాధిలో ఉన్నంత వరకది తనకు వశం కాదు. స్థూలరూపంలో అది తన దగ్గర ఉన్నా దాని సూక్ష్మ సూక్ష్మతర రూపాలక్కడ లేవు. అవి తన నిర్బంధంలో నుంచి తప్పించుకొని ఎప్పుడో స్వామి వారిని చేరిపోయాయి. అశోకవనంలో రాక్షసీ మధ్యంలో పుష్పఫల భరిత వృక్షములతోను ఇటూ అటూ సంచరించే భ్రమరములతోను సముద్రతీరంలో జనించి ప్రకాశించే అరణ్యసీమలలో నాతో సహా నీవు నానాలంకార శోభితవై క్రీడించరాదా అని వాపోతాడు. ఇది సీతాదేవితో మొరపెడెతున్నా తదాకారంలో భాసిస్తున్న ఆ త్రిపుర సుందరితోనే మొరపెడుతున్నాడని తోస్తుంది ఆ తామసోపాసకుడు. సుధా సాగరము, కదంబవనము, తన్మధ్యంలో నానాలంకార భూషిత అయిన అమ్మవారే కనిపిస్తున్నది మనోనేత్రానికీ వర్ణనలో.

  తెలిసో తెలియకో అమ్మను సంబోధిస్తున్నా అతడమ్మ సౌందర్యాన్నే ఉపాసిస్తున్నా ఆవిడ బాహ్య సౌందర్యాన్నే దర్శిస్తూ దానికే పరవశుడై పోతున్నాడతడు. యద్యత్పశ్యామి తేగాత్రం-శాతాంశు సదృశాననే తస్మింస్తస్మిన్ వృధుశోణి - చక్షుర్మమ నిబధ్యతే. నీ శరీరంలో ఒకొక్క అవయవ శోభను చూచే కొద్దీ అందులోనే నా చూపు దిగబడి పోయి ఎంత లాగినా పైకి రావటం లేదంటాడు. ఇది కేవలం బాహ్యోపాసనే. అంతస్సౌందర్యోపాసన కాదు. అంతస్సౌందర్యాన్నే దర్శించగలిగితే అప్పుడీ కామవాసన ఉండదు. విశ్వవ్యాప్తమైన దర్శనం కాబట్టి నిష్కామమది. నిష్కామమైతే ఆప్త కామం. ఆప్తకామమైతే అకామం. ఆత్మస్వరూపమే వాడిక ఆత్మారాముడైన రాముడే. రావణుడు కాదు. వాడికెలాగూ అమ్మ అధీనమే. ఆ స్థాయి కెదగకుండానే ఆ జగన్మాతను తనకు వశవర్తిని చేసుకోవాలని చూస్తే అత్యాశ అయి హతాశుణ్ణి చేస్తుంది ఆ రాధకుణ్ణి. వాడికది అధీనంలోనే ఉన్నా అధీన కాదు. విశ్వవ్యాపిని అయిన శక్తి ఒకానొక వ్యక్తి కెలాదక్కుతుంది. దక్కినట్టు భావించినా దక్కదది. దక్కినట్టు కనిపిస్తున్న దాశక్తి వ్యక్తమైన స్థూలరూపమే. అదే అశోకవనంలో శింశుపక్రింద

Page 317

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు