పారింది. దీన్ని పరాభవించి పంపితే చాలు. ఇది వెళ్లి మనవార్త అతడికి చేరవేస్తుందని అనేక విధాల చదురులాడి దానిన రెచ్చగొట్టి ముక్కు చెవులు కోయించి పంపాడు దాన్ని. అది ఖరదూషణాదులను పురికొల్పింది. చతుర్దశ సహస్ర సైనిక సహితంగా వారు ముగ్గురినీ నుగ్గునూచం చేశాడు రాముడు. అంత పని జరిగితే ఆ పాటికి వార్త రావణుడికి చేరకపోతుందా ? చేరక పోవటానికి గూఢచారులకేమి తక్కువ. దండకారణ్యమంతా అతనిచారులే. అది ఆ రాముడికి తెలియకపోలేదు. తెలిసే చూపాడు తన ప్రతాపాన్ని ఎవడో ఒకడు వెళ్లి చెప్పనీయమని. చెప్పనే చెప్పాడు అకంపనుడుడనే దూత వెళ్లి రావణుడికి. ఎవడా హతాసువు నాకు కీడు చేసి బ్రతకదలచిన వాడని మండిపడతాడు రావణుడు. వృషస్కంధుడు సింహసంహననుడు వృత్తాయత మహాభుజుడూ దశరథ కుమారుడు రాముడంటాడు వాడు. అనగానే నాగేంద్ర ఇవనిః శ్వస్య. సర్పరాజు లాగా బుసకొట్టాడట. ఇన్నాళ్లకు వచ్చాడు గదా నా స్వామి అనుకొన్నాడో ఏమో ? ససురేంద్రేణ సంయుక్తో రామస్సర్వామరై స్సహ ఏమతడు దేవేంద్రుడితో దేవతలందరితో కలిసి వచ్చాడా అని అడిగితే అతడొక్కడేనని చెబితే అయితే ఇప్పుడే వెళ్లి వాడిని చంపి వస్తానంటాడు. అతడి నేమిటి నీవు చంపటమేమిటి ? అది అసాధ్యం సుమా అని అతడి యుద్ధ కౌశలం వర్ణిస్తాడు అకంపనుడు. గ్రహించాడు రావణుడతడు తన ప్రభువే నని. ఆ ప్రభువుచేతిలోని దప్పటి శార్జమేనని ఇంతకూ నీవతణ్ణి వధించలేవు. ఒక ఉపాయం చెబుతాను విను. అతడి భార్య త్రిలోకసుందరి. ఆవిడను మోసగించి తీసుకురా. ఆ వియోగంతో అతడే మరణిస్తాడని సలహా ఇస్తాడు. అప్పుడు ఆరోచయత తద్వాక్యం రావణః అంత పౌరుషంగా పలికినవాడు ఆ మాటకు సంతోషించాడు రావణుడు. ఏమి కారణం. ప్రభువు వారిని తామేమీ చేయలేడు. ఆయనను సాధించాలంటే తదీయ శక్తి నపహరించటమొక్కటే ఉపాయం. అది ఆయనకు నిత్యానపాయిని. ఆయిన దానికి నిత్యానపాయి. ఎడబాటు సహించలేడు. తప్పకుండా దండెత్తి వస్తాడు తన్ను తరింపజేస్తాడు. వెంటనే పోయి మారీచుణ్ణి సలహా అడిగాడు చీవాట్లు పెట్టి పంపితే తిరిగి ఇల్లు చేరతాడు.
ఆ తరువాత వచ్చింది శూర్పణఖ. వచ్చి తన పరాభవం చెప్పి నానాచీవాట్లు పెట్టింది అన్నగారిని. ఇంత జరిగితే నీవు తెలుసుకోకుండా ఎలా ఉన్నావు. నీచారు
Page 314