#


Index



రామ రావణులు

పట్టణంలో ఉండకూడదు. అడవులకు పోతేనే ఆవిడకు ధైర్యం. అందుకే పదునాలుగేండ్లు తనకు అరణ్యవాసం కూడా కోరిందావిడ. ఆవిడ కోరిందని ఒక నెపం. అది తన సంకల్పమే. ఆయన సంకల్ప శక్తే ఇచ్ఛాశక్తే ఇదంతా. అదే వారి కాయా బుద్ధులు పుట్టించి క్రియారూపంగా పనిచేస్తున్నది. మహా తల్లిని వెంట బెట్టుకొని వచ్చాడుగా. ఏమని వెంట తెచ్చాడో ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో అయోధ్యలో. అప్పుడే సయోధ్య చెడింది. కొత్త కోడలడుగు పెట్టిన ముహూర్తం పట్టాభిషేక ముహూర్తాన్ని బండలు చేసింది. దానికి మారుగా వసిష్ఠుడి ముహూర్తాన్ని కాదని అరణ్యవాసానికి క్రొత్తగా ఒక ముహూర్తం పెట్టింది. అంతకన్నా శుభముహూర్తం లేనట్టు. తానూ అదేదో వండగలాగా అతనితో బయలుదేరింది. భగవానుడి సంకల్పమే సీతామాత రూపంలో ఇలా క్రియాశక్తిగా పరిణమించి పని చేస్తుంటే ఎవరాపగలరు. దశరథుడా, కైకా, కౌసల్యా, వసిష్ఠుడా, ప్రజలా. ఎవరూ ఆపలేరు. ఎవరికీ లేదా శక్తి. ఆదిశక్తి నాపేశక్తి మరేముంది అన్ని శక్తులూ దాని మార్గానికి వైదొలగవలసిందే. అలాగే తొలగారందరు, దశరథుడు, పలవించి కన్నుమూశాడు కైక సిగ్గుతో తలవంచింది. కౌసల్యాదులు దుఃఖంతో క్రుంగిపోయారు. ప్రజలంతా పాలలాగా ఒక్కసారి పొంగి చల్లారి చప్పబడ్డారు. వసిష్టుడూరకే మౌనం వహించాడు. పోతే వీరందరి పట్టు వదిలించుకొని బయటపడ్డాను గదా అని సంతోషంగా ప్రయాణమయి పోయాడు రామచంద్రుడు. అప్పటికీ భరతుడు వచ్చి వెనుకకు రమ్మని బలవంతం చేస్తే తనపాదుకలిచ్చి అతని నిర్బంధం కూడా వదిలించుకొన్నాడు. ఇదికాదు నాకు కావలసింది. నేను నీకోస మవతరించాను. నిన్ను వెతుక్కొంటూ వచ్చాను. నీ రాజ్యంలోనే అడుగుపెట్టాను. ఇదుగో నా శక్తి నా మాయాశక్తి. దానికి జవాబు చెప్పమన్నాడు రావణుణ్ణి.

  స్వామివారి సవాలు నెదుర్కొన్నాడు రావణుడు. అలాగే చెబుతానన్నాడు జవాబు. దానికి మొదట చెప్పిన జవాబే శూర్పణఖ. అది వచ్చి హావభావాలు చూపింది. నన్ను పెండ్లాడమని బలవంతం చేసింది. కావలసివస్తే ఈ సీతను కబళిస్తాను. మన మిద్దరము హాయిగా విశృంఖలంగా విహరించవచ్చు నంటుంది. ఎవరు నీవని అడిగితే నేను రావణుడి చెల్లెలు శూర్పణఖను, మా అన్న రావణుడి పేరు నీవు వినలేదా అని అడుగుతుంది. ఓ ఇది రావణుడి చెల్లెలా ? అయితే ఇక మన పాచిక

Page 313

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు