నీవు మహర్షుల యజ్ఞయాగాలకు విఘ్నం చేయిస్తున్నావు. ఇదుగో నేనొక మహర్షి యజ్ఞాన్ని కాపాడటానికి బయలుదేరి వచ్చానన్నాడు రాముడు. సరే ఇల్లు విడిచి బయటపడ్డాడు గదా అనుకొన్నాడు రావణుడు. ఇదుగో మీ రాక్షసుల నొకరొకరినే నా అస్త్రప్రభావంతో హతమారుస్తూ వస్తున్నాను. నా దగ్గర నీ వరప్రభావమేమీ పని చేయదని చాటాడు రాముడు. అది నీవు వెళ్లి మీ వాళ్లకు తెలియజెప్పమని మారీచుణ్ణి వారి రాజ్యంలోకి విసరివేశాడు కూడా. సరేకానీ అంతకాడికి వస్తే అప్పుడే నీ సత్తా చూస్తానన్నాడు రావణుడు. అహల్యా శాపవిమోచనం చేశాడు రాముడు. అర్ధం చేసుకొన్నాడు నారాయణుడని. శివధనుర్భంగం చేసి సీతను పెండ్లాడాడు. ఇంకేమి వేదవతిమాట ఋజువయింది. శివధనుస్సు విరవగలవాడు విష్ణువు గాక మరెవరు. ఆయన చేసుకొన్న ఆ సీత సాక్షాలక్ష్మి సందేహం లేదు. పరశురాముణ్ణి దారిలో పరాభవించాడు. వైష్ణవ ధనుస్సు నతడిస్తే పరిగ్రహించాడు. పరశురాము ఉంతవాడు పరాజితుడు కావటము, ధనుస్సు నర్పించి వెళ్లిపోవటము ఎవడీ పరశురాముడు తన్ను గడగడలాడించిన కార్తవీర్యుణ్ణి కాలరాచినవాడు. ఆయన నవలీలగా జయించాడే ఈ మహానుభావుడు. పైగా వైష్ణవమైన కార్ముకాన్ని చేతబట్టాడే విష్ణువే ఇక అనుమానం లేదని తోచింది రావణుడికి. అలా తోచాలనే చేసి చూపుతున్నాడు రాముడు.
అయితే ఇంతా చేసి చివర కయోధ్యలోనే తిష్ఠ వేసుకొని నిలిచిపోతే ఎలాగ ప్రయాణం. అది రాముడికీ ఇష్టంలేదు. అంతకన్నా రావణుడికి ఇష్టం లేదు. తమ రాజ్యానికి వస్తాడో లేదో నని అతడు భయపడుతుంటే తప్పకుండా నీ రాజ్యానికే బయలుదేరి వస్తున్నా నన్నాడు ఇతడు. పెండ్లి అయి అయోధ్యకు తరలి వచ్చినప్పటి నుంచీ ఎప్పుడెప్పుడు తప్పించుకొని పోవాలా అనే ఉన్నది రాముడికి. దశరథుడంటున్నాడే గాని అది కొనసాగదు. దానికి కైక అడ్డుపడుతుందని తెలుసు. కైకకు కాకపోయినా మంధర అయినా ఆవిడకా బుద్ధి పుట్టిస్తుందని తెలుసు. అది తానింతకు ముందు మామగారి కిచ్చి ఉన్న మాటే కాబట్టి దానికా ముసలాయన బద్ధుడు కాక తప్పదు. దానితో భరతుడు రాజయి తీరవలసిందే అంతవరకే అయితే సుఖంలేదు. అతడు రాజు కావటమే కాదు. తాను అడవులకు తరలిపోవాలి. అది ఎలాగ ? అందుకు కూడా తయారయి ఉందొక పథకం. చిన్నవాడికి రాజ్యమిస్తే పెద్దవాడూరకుంటాడా ? ముప్పు తెస్తాడని భయం కైకకు. అందుకోసం తాను
Page 312