పరాక్రమాన్ని అర్ధం చేసుకొని అయినా ప్రత్యక్షమవుతాడేమో నని ఆలోచించాడు. కార్తవీర్యార్జునుణ్ణి కదలించబోయివాడు కారాగృహంలో బంధిస్తే తన తాత పులస్త్యుడు వచ్చి సిఫారసు చేస్తే నెమ్మదిగా బయటపడ్డాడు. మహాబలశాలి అని తెలియక వాలిని పట్టబోయి అతడి చంకలో ఇరికిన తన చేతుల పట్టు విడిపించుకోలేక గిలగిల లాడిపోయాడు. ఇవి రెండూ నీకు పరీక్షలు, ఈ పరీక్షలో ముందు నెగ్గు, తరువాత చూతాము నీ సంగతి అని స్వామి అతడికి ముందుగా హెచ్చరిక చేస్తే స్వామీ అవి సాధించటం మీవంతేగాని నా వంతుగాదని వినమ్రుడయి మనవి చేస్తున్నట్టున్నదా స్వామి భక్తుడు.
సరే. ఇక ఆలస్యం దేనికి ఆ భక్తుడి కోరిక మేరకే అవతరిస్తామని సంకల్పించాడా
భగవానుడు. అయితే ఎక్కడ అవతరించాలి. ఎలా అవతరించాలి. ఎక్కడ అని
ప్రశ్నేముంది. ఇక్ష్వాకు వంశంలోనని అనరణ్యుడి శాపముంది గదా. కాబట్టి ఆ
వంశంలోనే అవతరించాలి. ఎలాగ ? ఎలాగని ప్రశ్నేముంది. ఆ వంశంలో
అన్నప్పుడది ఇక మానవ రూపంలోనే. దానవుణ్ణి చంపటానికి మానవుడి రూప
మేమిటి? మానవుడి వల్ల తప్ప మరెవరివల్లా చావు రాగూడదని కోరాడాదానవుడు.
వారేమి చేయగలరని ఆ దానవుడి నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యంలోనే ఒక లక్ష్యాన్ని దర్శించాడా
సుదర్శనాయుధుడు. దానికి తగినట్టుగానే ఏర్పడింది దశరథుడి పుత్రకామేష్టి,
దశరథుడయోధ్యాధిపతి. కనుక అనరణ్యుడి శాపాని కనుగుణంగానే ఉంది తన
సంకల్పం. అంతేకాదు. దేవతలకు కూడా అప్పటికే తలబట్టి పోయింది రావణుడితో.
పట్టిపోయి అంతకు ముందే ఒకప్పుడు రావణుడు తమ మీదికి వచ్చి బాధిస్తుంటే
మొరపెట్టాడు దేవేంద్రుడు దేవదేవునితో అయ్యా వీణ్ణి హతమార్చమని అంటే ఇప్పుడే
కాదు. వీడు వరప్రభావ సంపన్నుడది క్షీణించటానికింకా పడుతుంది కొంత కాలమని
ముందే తాను జోస్యం చెప్పి ఉన్నాడు. ఇదుగో ఇప్పుడా జోస్యం ఫలించేకాలం
వచ్చిందని తెలుసునా కాలస్వరూపిడికి, అందుకే దేవతలు హవిర్గ్రహణార్థులై మరలా
వచ్చి తనతో మొరపెట్టటము, అనరణ్యుడు తన వంశీయుడే నిన్ను చంపుతాడని
రావణుణ్ణి శపించి ఉండటము ఇవన్నీ తోడయినాయి. వీటికి తోడు అందరివల్లా
అవధ్యత్వం కోరినవాడు మానవులవల్ల కోరకపోవటం తన సంకల్పాని కింకా
బలమిచ్చింది. మానవుడుగానే జన్మిస్తున్నాను. మరి నీవు దర్శించి శపించబడ్డ
Page 310