#


Index



రామ రావణులు

పొమ్మని సాగనంపుతాడు. ఆయన కపిలావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. ఆయన పాదోపసేవిని సాక్షాన్మహా లక్ష్మియే. రావణుడావిడ నపహరించబోవటం రాబోవు సీతాపహరణాన్ని మనకు సూచిస్తుంది. నీ వల్లనేమరణించాలని ఇతడు కోరటము, నా వల్లనే జరుగుతుందని అతడు చెప్పటము, భగవద్భాగవతుల మధ్య రహస్యంగా జరిగిన ఒప్పందమే. ఇప్పటికి రెండుసార్లు జరిగింది భగవత్సందర్శన మా వైరభక్తుడికి. అడపా దడపా అతడు తన్నెక్కడ మరచిపోతాడో నని జ్ఞాపకం చేస్తున్నాడు స్వామి. స్వామీ నేను మరవలేదు. మీకోసమే సుమా నాగవేషణ అంతా నని వినకారు చేస్తున్నాడు రావణుడు. ఈ అన్వేషణ కొక కారణం కూడా ఉన్నదని బయటపెడతాడగస్త్యుడు. కృతయుగంలోనే అసలు రావణుడొకమారు సనత్కుమారుణ్ణి కలుసుకొని విష్ణుతత్త్వాన్ని గూర్చి అడుగుతాడు. ఆయన స్వరూపమేమిటి ఆయనను చేరే ఉపాయమేమిటని అంతా అడిగి తెలుసుకొంటాడు. ఎలాగూ ఆయన నీ కోసమే త్రేతాయుగంలో అవతరించబోతున్నా డమ్మవారు సీతగా జన్మించబోతోంది. అంతదాకా ఓపిక పట్టమని సెలవిస్తాడు సనత్కుమారుడు. ఇదంతా మొదటి మంచి మనసులో ఉండనే ఉంది రావణుడికి. అందుకే ఆయన భార్య నపహరించబోవటం.

  పోతే అమ్మవారినిప్పుడు బలాత్కరించబోయాడే ఈ బలాత్కరణ శ్రుతిమించితే అది తన ప్రాణహతికే దారి తీస్తుందని హెచ్చరించదలచాడు స్వామి తన దాసుణ్ణి. అది ఎలాగో ఆచరించి తెలుసుకొందామనుకొన్నాడు తాను. దానికి పూర్వరంగమే రంభా బలవత్సంభోగం. దాని ఫలితంగా నలకూబరుడి కోపావేశానికగ్గమయి అది మొదలు ఏ స్త్రీని బలాత్కరించినా భగ్గున దగ్ధమయిపోతావని శాపానికి గురి అయ్యాడు. కనుకనే జగన్మాతను అపహరించాడే గాని బలాత్కరించే సాహసం చేయలేదు. చేయలేడు కూడా. అది దాసభావంతో ఉన్నంతవరకూ సంభవించేది కాదు. స్వామి భావంతో మాత్రమే సంభవమని తెలుసునతనికి నలకూబర శాపం కూడా లభించింది. ఇక దేనికి కాలహరణం. ఇంకా స్వామి సాక్షాత్కారం గాదేమిటి ? ఎప్పటికా మహాభాగ్యం సరే దేవకార్యం కోసం కదా ఆయన అవతరిస్తానని శపధం పట్టి ఉన్నాడు. ఆ దేవతలనే పట్టి చూస్తామనుకొన్నాడు. దేవేంద్రుడితోనే యుద్ధానికి దిగాడు. కాందిశీకుడై ఇంద్రుడు పారిపోయాడు. ఇక తన కెదురు లేదనుకొన్నాడు. మరి కొందరు దుర్జయులైన మహావీరులను పట్టి చూతాము. దానితో తన అతిలోక

Page 309

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు