మంచిదే. ఇది ఋషిత్వానికి పనికి వస్తుందేగాని కవిత్వానికెలా తోడ్పడుతుందని ఆశంకించరాదు. నానృషిః కురుతేకావ్యమని గదా చెప్పాము. ఋషిత్వమే కవిత్వం. అంతకన్నా భిన్నంకాదు. ద్రష్ట అయితే ఋషి. ఆ ఋషే స్రష్ట అయితే కవి. దేనికైనా యోగ్యత నాపాదించేది ఈ శ్రవణాది త్రితయమే. ఆలంకారికులు ఒక ఉత్తమ కావ్యనిర్మాణానికి సామగ్రి నభివర్ణిస్తూ మూడు లక్షణాలు ముఖ్యంగా ఉదాహరించారు. “శక్తిర్నిపుణతాలోక శాస్త్రకావ్యాద్య వేక్షణాత్ - కావ్యజ్ఞ శిక్షయా భ్యాసః ఇతిహేతుస్తదుద్భవే" శక్తి, నిపుణత, అభ్యాసం ఇవి మూడేనట కవికుండవలసిన లక్షణాలు. ప్రతిభావ్యుత్పత్యభ్యాసాలనేవి మూడూ కలిసి హేతువని ఏకవచనాంతంగా చెప్పటంవల్ల మూడూ అనివార్యంగా ఉండాలి కవికి అని అర్ధమవుతున్నది. రహస్యమేమిటంటే ఇవి మూడూ ఏవో కావు. ముందు పేర్కొన్న శ్రవణాదులే. శ్రవణాదులుగా చెప్పిన మూడే ప్రతిభాదులు. శ్రవణమే వ్యుత్పత్తి. మననమే అభ్యాసం. పోతే నిది ధ్యాసనమే ప్రతిభ. ఒకటి శాస్త్ర భాష అయితే మరొకటి కావ్యభాష అంత మాత్రమే తేడా. కనుక ఋషి లక్షణాలే కవి లక్షణాలు. మహాకవి మహర్షి. మొదట ద్రష్ట అయి తరువాతనే అతడు స్రష్ట అవుతాడు.
అయితే ఆ స్రష్టృత్వానికొక బలమైన ప్రచోదన కావాలి. అది అతని అంతర్గతమైన భావన అయినా కావచ్చు. లేక బాహ్యప్రకృతిలో తారసమయ్యే ఒక సంఘటన అయినా కావచ్చు. బాహ్యంగా జరిగినదైతే అది ఇంకా బలంగా వచ్చి అతని భావనమీద పడుతుంది. దానితో భావన ఇంకా ఎక్కువ ఆవేశాన్ని పుంజుకొంటుంది. ఘనమైన ఆ భావనే వెంటనే రసీభవించి అక్షర రూపంగా బయటికి ప్రసరిస్తుంది. అక్షర రూపంగానే లోకంలో నిలిచిపోతుంది. సరిగా వాల్మీకి జీవితంలో జరిగిన సంఘటన ఇదే. పామరంగా సాగిన బ్రతుకునుంచి బయటపడి తపస్వాధ్యాయ నిరతుడయి ప్రాచేతసుడయి ఋషి పుంగవుడయిన తాను ఒకనాడు తమసా నదికి స్నానార్థమయి బయలుదేరాడు. తత్సమీపంలో క్రౌంచపక్షి నతిక్రూరంగా వధించిన కిరాతుడి చర్య చూచాడు. ఇదే ప్రకృతిలో అతడికి తారసిల్లిన సన్నివేశం. అంతవరకూ ఋషిగా ఉండిపోయిన అతణ్ణి కవిగా మార్చిన సన్నివేశం. దారుణమైన ఆ దృశ్యం చూచేసరి కొక్కసారిగా ఆయన మనోయవనికమీద తిరిగిపోయింది. ఏమిటి. తన గత జీవిత స్మృతి సంతతి. గతంలో తానూ ఒక కిరాతుడే. నిష్కరుణ
Page 31