#


Index



రామ రావణులు

అయి గజిబిజి పడ్డాడు. దానితో ఎలాగో ఆయన అనుగ్రహిస్తే మరలా బ్రతికి బయటపడ్డాడు. ఇదంతా చూస్తే నేను నా స్వకీయులనే లెక్క చేయలేదు. బ్రహ్మ మహేశ్వరులతోనే తలపడ్డాను. ఇక నీదేమిటి. ఎక్కడున్నావు ? చేవ ఉంటే బయటికి రమ్మని సవాలు చేస్తున్నట్టున్నదా విష్ణుదేవుని. ఇంతలో పుష్పకారూఢుడై ఆకాశయానం చేస్తూ హిమవచ్చిఖరం మీద తపస్సు చేసే వేదవతిని చూచాడు. ఆవిడను బలాత్కరించబోయి అది సఫలం కాకపోగా ఆవిడ శాపానికి గురి అయ్యాడు. ఆవిడే గదా తరువాత సీతనయి జన్మించి విష్ణువునే వివాహమాడి ఆయన చేత నిన్ను నీ వంశాన్ని హతమారుస్తానని శపించింది. అప్పటి కొకటి రూఢమయిందా వైరభక్తుడి మనస్సుకు. తానెక్కడ ఉన్నాడని ప్రశ్నించే విష్ణువు తప్పకుండా కొంత కాలానికెక్కడో అవతరిస్తాడని అతడిని మహాలక్ష్మి వివాహమాడుతుందని ఆయన వానర సైన్యంతోనే కదలి వచ్చి త్వరలోనే తనకు విమోచనం కలిగిస్తాడని. బ్రహ్మాదులు, ఋషులు, దేవతలు, అందరూ అప్పటికే విసుగుచెంది ఉన్నారు. కాబట్టి దానికి వారందరూ దోహదం చేస్తారని కూడా తెలుసు నతనికి. అయితే స్వామివారు జన్మిస్తాడని తెలుసుగాని ఎక్కడ జన్మిస్తాడని ఎవరి వంశంలో జన్మిస్తాడని ఇంకా తెలియదు. అందుకోస మన్వేషిస్తుంటే స్వామివారే దారి చూపారు. అది పట్టుకొని బయలుదేరాడా దానవభక్తుడు. సరాసరి అది అయోధ్య వైపే దారి తీసింది. అక్కడ రాజ్యం చేస్తున్నాడు. అనరణ్యుడనే ఇక్ష్వాకుల చక్రవర్తి. సూర్యవంశీయుడతడు. అతడితో తలపడి వధించబోయే సమయంలో అతడు శాపమిచ్చాడు నన్ను చంపానని సంతోషించకు. నా వంశంలోనే ఒక మహానుభావుడు జన్మించి నీ అంతు చూస్తాడని. వెంటనే స్మరణకు వచ్చింది వేదవతి ప్రతిజ్ఞ మరుజన్ములో విష్ణువునే వరించి ఆ విష్ణువుచేతనే చంపిస్తానని గదా ఆవిడ చేసిన ప్రతిజ్ఞ. ఇంకేమి. ప్రభువు వారీ ఇక్ష్వాకుల గృహంలో ఈ అయోధ్యలోనే అవతరించబోతున్నారని అర్ధం చేసుకొన్నాడు. అయోధ్యలోనే అమ్మవారిని చెట్టబట్టి వానర సైన్యంతో వచ్చి ఆయన తన భరతం పట్టటం ఖాయమని నిర్ధారణ అయిందిప్పటికి..

  మరి ఇక చేయవలసిందేమిటి తాను. కాలహరణం పనికిరాదు. త్వరత్వరగా అది తనకు తటస్థపడే లాగా చూచుకోవాలి. దాని కనుగుణంగా ఇంకా కొన్ని ఘనకార్యాలు చేసి ఆయన శీఘ్రావతరణ కోసం ప్రయత్నించాలి. దానితో మొదట

Page 307

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు