ఆవహించింది. అప్పటి నుంచి అనుకూల శత్రువై అతడిచేత నానావిధములైన ఘోరకృత్యాలు మౌనంగా చేయిస్తూ వచ్చి చివరకతణ్ణి మరలా తన కభిముఖంగా తీసుకువచ్చింది.
రాముడిలా ముందుగానే వైరనాటకానికి నాంది పలికితే మరి రావణుడేమి తక్కువవాడా ? ఆ నాందీ ప్రస్తావనకు తగినట్టుగానే తన జీవితంలో ఆయా అంకాలనిక నడపసాగాడు. మాల్యవదాదుల ఉపదేశము, మందోదరిని చెట్టపట్టటమూ అయింది. అంతే. సాగించాడిక ఎక్కడలేని సంరంభమంతా. విష్ణువని తనస్వామి నామం ఎప్పుడు చెవినబడిందో అప్పుడిక అతడి కంటికిఏది కనపడలేదు. ఎలాగైనా ఎప్పటికై నా దూరమై పోయిన ఆ మూర్తిని మరల దర్శించాలి. ఏయే కార్యాలు చేస్తే ఆ మహాభాగ్యానికి నోచుకొంటాడో అవన్నీ వరుసగా చేసి తీరాలి. అని తహ తహ ఆ వైరభక్తుడికి. అందుకే విజృంభించసాగాడు. ఆయన తన్ను దర్శించాలంటే ఆయనను నమ్ముకొన్న వారందరినీ ముందుపట్టి బాధించాలి. వారి ఐశ్వర్య మపహరించాలి. వారి ఆగ్రహానికి గురి అయి చివరకు ఎలాంటి శాపమైన నెత్తికి తెచ్చుకోవాలి. శాపంలాగా కనిపించినా తన ప్రభువును చేరటానికదే తనకొక వరప్రసాదం కాగలదని అతని నిగూఢమైన ఆశయం ఆశ. ఈ ఆశాపాశానికి మొట్టమొదటనే కట్టి పడేశాడు తన అన్న కుబేరుణ్ణి అతడి లంకా పట్టణాన్ని బలవంతంగా లాగుకొని మరలా తాను లంకా. ధీశుడయ్యాడు. అతడు తనకు హితం చెప్పి పంపబోతే అతడు పంపిన దూతనే నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. తరువాత అతడి మీదకి దండెత్తిపోయి అతణ్ణి పారదోలి అతడి పుష్పక విమానాన్ని కూడా కైవసం చేసుకొన్నాడు. దీనితో తన తండ్రి విశ్రవసుడికీ తాత పులస్త్యుడికే గాక బ్రహ్మవంశానికే అప్రతిష్ఠ కొని తెచ్చాడు.
అంతేకాదు. అక్కడి నుంచి కైలాసం బయలుదేరి పోయాడు. అక్కడ కాపలా ఉన్న నందికేశ్వరుణ్ణి చూచి వానరముఖుడని అపహసించాడు. వానరులవల్లనే దెబ్బ తింటావని అతడివల్ల వృధాగా శాపం తెచ్చుకొన్నాడు. కైలాసాన్నే ఎత్తబోయాడు. తనమిత్రుడు కుబేరుణ్ణి అవమానించి నాడీ దుస్సాహసి అని పరమేశ్వరుడి కసలే కోపం. దానికి తోడు ఇప్పుడు తన కొంపకే ముప్పు తెచ్చాడు. వెంటనే పర్వతాన్ని క్రిందికి బలంగా నొక్కిపట్టాడు. దానితో పది తలలూ ఇరువది చేతులు నజిగిజి
Page 306