#


Index



రామ రావణులు

కామక్రోధాదులను నిగ్రహించే స్వభావమున్నవి. వారే కుబేరాదులైన యక్షులు సాధుస్వభావులు వారు. పోతే రక్షిస్తామన్న వేవో కావు. ఆ కామక్రోధాది గుణాలను నెత్తిన వేసుకొని వాటినే కాపాడే స్వభావమున్నది. వారే మాల్యవదాది రాక్షసులు. ఆ అసుర సంపదకీ దైవసంపద అంటే సరిపడదు. తపస్సు చేసి తత్ప్రభావంతో వారిని మించిపోవాలని ఆశించినా అది సకామము స్వార్ధపూరితము కాబట్టి ఎప్పటికైనా అనర్థదాయకమే. అయితే చిత్రమేమంటే విష్ణువు మాలిని మాత్రమే వధించాడు. మాల్యవంతుణ్ణి సుమాలినీ చంపలేదు. మాల్యవంతుడి వల్ల బాధలేదు. వాడు తరువాత బాగా పరివర్తన చెందిన సాధువర్తనుడయ్యాడు. రావణుడికి తరువాత రాముడితో సంధి చేసుకోమని సలహా ఇచ్చింది వాడే. పోతే సుమాలిని కూడా రసాతలానికి పారదోలాడే కాని చంపలేదు. ఎందుకంటే తరువాత వాడితో పని ఉన్నది. వాడే గదా తన కూతురు కైకసిని విశ్రవసుడి దగ్గరికి పంపించాడు. దానికే గదా ఆయన వల్ల రావణాదులు జన్మిస్తారు. కాబట్టి వాణ్ణి బ్రతికించి రావణోత్పత్తికి దోహదం చేశాడు మహావిష్ణువు. అంతేకాదు. తరువాత రావణుడికి తనమీద ద్వేషం పుట్టటానికి కారణభూతులీ సుమాలీ మాల్యవంతులే. అంతవరకూ రావణుడికి తన ఊసు తెలియదు. తపస్సు చేసి వరాలు సంపాదించాడు. అంత మాత్రమే. తన అన్న కుబేరుడన్నా అతని యక్షపరివారమన్నా ఎనలేని గౌరవమతనికి. అంతవరకూ చెడ్డబుద్ది ఇంకా ప్రవేశించలేదతడిలో. అది ఈ మాల్యవదాదుల వల్ల ఏర్పడింది. తాము దేవతలచేతిలో ఓడిపోయామని తమ సోదరుడు మరణించాడని లంక తమకు దక్కకుండా పోయిందని దీనికంతా కారణం విష్నువేనని వారికాయనమీద ద్వేషం. ఈ ద్వేష భావాన్ని రావణుడికెక్కించి అంతవరకూ సాధువనిపించుకొన్న అతడి మనసులో విష్ణుద్వేషమనే బీజాన్ని నాటారు అలా నాటాలనే నాటి తద్ద్వారా తన సంగతి రావణుడు మరచిపోకుండా మరలా జ్ఞప్తికి తెచ్చుకోవాలనే స్వామివారి ఆశయం. అందుకే ఆ ముగ్గురు సోదరులలో ఒకరిని వధించి ఇద్దరిని బ్రతికించి ఆ వంశంలో తన భక్తుడికి జన్మ ఇచ్చి అది కూడా తన బ్రహ్మవంశంతో మరలా ముడిపెట్టి వారి మూలంగా అతడికి తన ఆచూకీ అందజేసే ప్రయత్నం. అందుకొని కూడా అతడెక్కడ తనతో వైరాన్ని కొనసాగించడోనని తనదే అయిన అసురమాయను వెంటనే అతడి మీద ప్రయోగించాడు. అదే మందోదరి రూపంలో అతణ్ణి

Page 305

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు