విమానాన్ని కూడా సంపాదిస్తాడతడు. తండ్రి సలహామేరకు మల్యావదాదులు ఖాళీ చేసి పోయిన లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని తానూ తన యక్ష బలగమూపోయి అక్కడ కాపురముంటాడు. అతడొకనాడు పుష్పకంలో విహరిస్తూ తండ్రి విశ్రవసుడి దగ్గరికి వచ్చి వెళ్లుతుండగా సుమాలి తన కూతురు కైకసిని వెంటబెట్టుకొని పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ఆ ప్రాంతంలో తిరుగుతూ అది చూచి ఆహా వీడెంత అదృష్టవంతుడు. ఇలాంటి మహనీయుడికి జన్మిచినందువల్ల గదా మన పట్టణాన్ని ఆక్రమించుకొని అప్లైశ్వర్యాలు అనుభవిస్తున్నాడు. మనం వీణ్ణి మించి పోవాలంటే ఇలాంటి మహర్షి వల్లనే సంతానాన్ని పడయటం మంచిదని తన కూతురి నాయన దగ్గరికి చెప్పి పంపుతాడు. అది అసుర సంధ్యలో వెళ్లి ఆయనను యాచించి తదనుగ్రహంతో అసురమైన సంతానాన్ని కంటుంది. వారే రావణ కుంభకర్ణాదులు.
ఇది అగస్త్యుడే కరువు పెడితే రాముడాలకిస్తున్న వృత్తాంతం. రావణాదులకు పూర్వులెవరు. వారు రావణాదులకంటే బలవంతులా ? ఏ అపరాధం చేశారని వారిని విష్ణువు పారదోలాడు. వారు లంక నెందుకు విడిచిపెట్టి వెళ్లారు. అని రాముడడిగితే ఈషద్విస్మయ మానస్తమగస్త్యః ప్రాహ. ఒక చిరునవ్వు నవ్వి ఈ వృత్తాంతాన్ని ఏ కరువు పెడుతూ వచ్చాడట అగస్త్యుడు. చిరునవ్వు దేనికి. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఈ మహానుభావుడు ప్రశ్నిస్తున్నాడే అని. వాచా అంటాడు కూడా అక్కడక్కడ వేదవతీ వృత్తాంతం వినిపించి ఆవిడ ఎవరో కాదు సైషాజనక రాజస్య ప్రసూతా తవభార్యా మహాభాగ విష్ణుస్త్వంహి సనాతనః ఆవిడ నీ భార్య సీత. నీవెవరో కావు సాక్షాత్తూ విష్ణువేఅని బయటపెడతాడు. అలాగే తదనంతరం మళ్లీ తన్ను చూడటానికి వస్తే త్వంహి నారాయణః శ్రీమాన్ త్వయి సర్వం ప్రతిష్ఠితమని చాటుతాడు. ఆయన చాటకపోతే మాత్రమీయనకు తెలియదా తాను నారాయణుడనని. తెలిసే తెలియనట్టు నటిస్తున్నాడని తెలుసు ఆ మహర్షికి. తెలుసునని తెలిసినా తెలియనట్టే అడిగి తెలుసుకొంటున్నాడీయన. ఇంతకూ ఈ జరిగిన వృత్తాంతాన్ని బట్టి చూస్తే రావణుడెక్కడ జన్మించాలో ఎలా జన్మించాలో ముందుగానే ఆలోచించి ఎంత పెద్ద పథకం వేశాడా ఆ మహానుభావుడనిపిస్తుంది. బ్రహ్మదేవుడు మొదట సృష్టించాడని చెప్పింది జలంకాదు. జలమనే పేరు గల పంచభూతాలే. వాటివల్ల ఏర్పడ్డ సత్త్వాలు వాటినే భక్షిస్తాయనేది భౌతికమైన
Page 304