అని ఇద్దరు బలశాలులు బయలుదేరారు. ప్రహేతి మంచివాడే. తపస్సుకు వెళ్లిపోయాడు. హేతి కాలభగిని అయిన భయ అనే కన్యను వివాహమాడి దానియందు విద్యుత్కేశిని కన్నాడు. విద్యుతేశుడికి సాలకటంకట అనే దానికి సుకేశుడనేవాడు జన్మిస్తాడు. వాడినది కని మందర పర్వతంమీద పారేసి పోతే గగన మార్గంలో యదృచ్ఛా విహారులై వెళ్లుతున్న పార్వతీ పరమేశ్వరులు వాణ్ణి సద్యోయౌపనుణ్ణి చేసి వరాలన్నీ ప్రసాదించి పోతారు. వాడు విశ్వావసుడనే గంధర్వరాజ కూతురు దేవవతి అనే దాన్ని చేసుకొంటాడు. వారిద్దరికీ పుట్టుకొచ్చారు. మాల్యవంతుడు, మాలి, సుమాలి అని ముగ్గురు కుమారులు. అక్కడి నుంచి మొదలయింది రాక్షస స్వభవమా వంశానికి. బ్రహ్మను గూర్చి తపస్సు చేసి అజేయత్వము, చిరజీవిత్వము, ఇలాంటి వరాలన్నీ సంపాదిస్తారు వారు. తరువాత విశ్వకర్మను నిర్మించి ఇమ్మని అడిగితే అదిగో ఉంది పోండి, దక్షిణ సముద్రతీరంలో సువేలమనే పర్వత శిఖరం మీద ఇంతకు ముందు నిర్మించి ఉన్నానొక మహానగరం. దానిపేరు లంక. అది మీరు నిశ్శంకంగా వెళ్లి ఆక్రమించుకొని అక్కడ కాపురముండవచ్చునంటాడు. సరేనని వెళ్లిపోయి వారక్కడ నివసిస్తుంటారు.
ఉన్నట్టుండి వారికేమి దుర్బుద్ధి పుట్టిందో ఏమో ? రాక్షస స్వభావం పురుగై తొలుస్తుంటే ఎలా ఊరుకోగలరు. వెంటనే స్వర్గంమీదకి దండయాత్ర సాగించారు. దేవతలను తరిమికొట్టారు. వారంతా లబోదిబోమని పోయి శంకరుడితో మొరపెట్టు కొన్నారు. అతడు వారంతా నావల్ల పైకి వచ్చారు. వారిని నేనేమి చేయలేను ఉపాయం మాత్రం చెబుతాను. వెళ్లి విష్ణువును శరణు వేడండి. ఆయన మీ ఆపద పాపగలడని సలహా ఇస్తాడు. వారు వెళ్లి విష్ణువుతో మొరపెడితే ఆయన వారికి హామీ ఇచ్చి యుద్ధంలో వారి నెదుక్కొంటాడు. మాలిని వధించి భయభ్రాంతులైన సుమాలి మాల్యవంతులను సపరివారంగా పాతాళానికి పారదోలుతాడు. వారు లంకను వదలివేసి అప్పటి నుంచి పాతాళంలో తలదాచుకొంటూ బ్రతుకుతుంటారు. దేవతల పక్ష మవలంభించి తమమీద నిష్కారణంగా ధ్వజమెత్తాడని విష్ణువుమీద పగబూనారు వారు. అది లోలోపల వారిలో అగ్నిహోత్రంలాగా రాజుతూనే ఉంది. తరువాత విశ్రవసుడు భరద్వాజుడి కుమార్తెను వివాహమాడితే వారికి వైశ్రవణుడనే కుమారుడు జన్మిస్తాడు. వాడే కుబేరుడు. యక్షుల కధిపతివాడు. బ్రహ్మవల్ల వరాలు పుష్పకమనే
Page 303