#


Index



రామ రావణులు

పుట్టి రావణుడు మధ్యలో కనిపిస్తే తరువాత పుట్టి రాముడు ముందు కనిపిస్తాడు. అంతేకాదు. రాముడుగా తరువాత కనిపించినా విష్ణువుగా ముందే దర్శనమిచ్చాడు. తరువాత దర్శించాడు రావణుడు. చిత్రమేమంటే రాముడు తెలుసుకొనేటప్పటికి రావణుడు లేడు. రావణుడు తెలుసుకొనేటప్పటికి రాముడు లేడు. ఇరువురూ సాగించిన ఈ దాగుడుమూతల వ్యవహారం రామాయణమిటు అయిదు కాండల పూర్వభాగము అటు ఒక కాండ ఉత్తరభాగము వ్యాపిస్తే మధ్యలో ఒక యుద్ధకాండలో ఒకే ఒక్కసారి తెరచాటు వీడిబయట పడతారిద్దరూ. పడి ఒకరినొకరు చూచుకొంటారు. అంతే మరలా ఒకరి కొకరు తెరమఱుగవుతారు. అంతవరకూ ఒకరిని గూర్చి ఒకరు వినటమే కనటమనేది లేదు. కంటే ఇక భక్తుడులేడు. మిగిలేది భగవంతుడే. ఆ భగవంతుడు కూడా భక్తుడికోసం ఒక వేషం వేసుకొనే వచ్చాడు కాబట్టి ఆ వేషం తీసివేసి ఆయనా చివరకు నిష్క్రమించాడు. మొత్తాని కిరువురూ రంగం నుంచి కొంచెం ముందు వెనుకగా నిష్క్రమించారు. ఆ నిష్క్రమించే వరకూ ఒక మహానాటకం ప్రదర్శించారు మన కనులముందు. ఏమిటా నాటకం. ఒకరందుకొనే ప్రమాదం. మరొకరందించే వినోదం.

  అందిచ్చే వినోదాన్ని రాముడెలా ప్రదర్శించాడో చూద్దాము. రాముడంటే ఎవడు. ఆదివిష్ణువే గదా అసలు. తన ద్వారకపాలకుడు రావణుడుగా జన్మిస్తాడని తనతో విరోధం సాగిస్తాడని ముందుగానే తెలుసు ఆయనకు. ఎవరికి జన్మిస్తాడీ రావణుడు. కైకసికి విశ్రవసుడివల్ల విశ్రవసుడెవరు ? పులస్త్యుడి కుమారుడు. పులస్త్యుడో బ్రహ్మపుత్రుడు. మరి బ్రహ్మ. తన నాభికమలం నుంచి జన్మించినవాడే. విశ్రవసు డప్పటికి తన ముని మనుమడే. మరి ఆ కైకసి ఎవరు. అది ఒక రాక్షసి. సుమాలి అనే రాక్షసరాజు కూతురు. అలాంటపుడా రాక్షసుడి కూతురికీ సాక్షాత్తూ తన మునిమనుమడైన ఈ విశ్రవసుడికీ సంధానమెలా అయిందని ప్రశ్న. అది తన కుమారుడైన బ్రహ్మనిర్వాహకత్వమే. ఏమి చేశాడాయన. ఆయిన ఊరకున్న వాడూరుకోక అప్తత్త్వాన్ని సృష్టించాడు. అందులో కొన్ని సత్త్వాలను కూడా సృష్టి చేశాడు. అవి కొన్ని వాటిని రక్షిస్తామంటే కొన్ని యక్షిస్తాము లేదా భక్షిస్తామని కూర్చున్నాయి. బ్రహ్మ వాటిని చూచి రక్షిస్తామన్నవాళ్లు రాక్షసులయి పోండి యక్షిస్తామన్న వాళ్లు యక్షులు కండని దీవించాడు. ఆ రాక్షసులలో హేతి ప్రహేతి

Page 302

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు