కలుపుకొన్నాడు. ఇక ఆ రజస్సునుకూడా డీకొని సత్త్వంలో దాన్ని లయం చేసుకోవలసి ఉంది. అందుకే శుద్ధ సత్త్వోపాధిగా అవతరించిన రాముడితో ఈ వైరం రావణుడికి. వైరం గాదిది. వైరభక్తి. వైరం సాగిస్తున్నట్టు పైకి అభినయం. లోపల అది నెపంగా భగవత్తత్త్వాన్ని అందుకొనే గొప్ప సాధన.
మరి భక్తుడి సాధన ఇది అయితే ఇక ఆ భగవానుడి సాధన ఏమిటి ? ఆయన సాధకుడు కాడు. నిత్యసిద్ధుడాయన. అయినా ఈ సాధకుడి కోసం తానూ ఒక సాధకుడిలాగా అభినయిస్తుంటాడు. సాధనలో అతడికి చేయూత నీయటమే ఆ అభినయం. అందుకోసమొక అవతారమెత్తాడు. ఎత్తి వైరంతో తన్ను చేరటానికి యత్నించే ఆ భక్తుణ్ని వైరమార్గంలోనే తానూ ఎదుర్కొంటూ వచ్చాడు. వైరానికి వైరమే పరిష్కారమిక్కడ. ఏమి కారణం. రెండూ ప్రతికూలాలే కాబట్టి రెండు ప్రతి కూలాలు కలిస్తే అది అనుకూలమే అయి తీరుతుంది. అది ఇద్దరికీ ఇష్టమే. అందుకే ఇద్దరూ కలిసి కొనా మొదలు ఈ వైర నాటకమాడసాగారు. అలాంటి ఇచ్చతోనే అసలావిర్భవించారు. ఆ ఇచ్ఛాశక్తులే క్రియా శక్తులయి నాటకాన్ని రక్తి కట్టించాయి. భక్తుడి శక్తి మందోదరి అయితే స్వామివారిశక్తి సీత అయింది. మందమైన అసురశక్తినే అమందమని భావించి స్వామిని సాధించదలచాడు భక్తుడు. మరి భగవానుడో. అది నీకుండి కూడా పనిచేయదన్నట్టు లాంగలంలాంటి తన సీతా శక్తినతని మీద ప్రయోగించి దానిని త్రోసి పుచ్చి భక్తుణ్ణి చివరకు తనవైపుకే లాగి వైచాడు.
రామరావణుల వ్యవహారమంతా ఇంతే ఇలా సాగుతూ పోయిందే. ఒకరినొక రందుకోవటానికి పరుగు పందెం సాగించినవారే. ఆయినను వెంటాడుతూ ఈయన. ఈయనను వెంటాడుతూ ఆయన. ఒకరికోసమొకరి అన్వేషణ. రాముడు పుట్టి రావణుడికోసమన్వేషిస్తే రాముడికన్నా ముందు పుట్టి రావణుడన్వేషిస్తూ వచ్చాడు. ముందు పుట్టిన రావణుడి విషయమెప్పుడో తరువాత రాముడు వింటే తన తరువాత పుట్టిన రాముడి విషయం ముందుగానే పసిగడతాడు రావణుడు. ముందు వచ్చి రావణుడు చేసిన చర్యలే మాత్రమూ తెలియనట్టు రాముడు నటిస్తే తరువాత వచ్చి రాముడు చేసిన పరాక్రమాదులేవీ తెలియనట్టే నటించాడు రావణుడు. తన పూర్వ చరిత్ర ఏమిటో తెలియనీయక తన తరువాత చరిత్రే రావణుడు చూపితే తన తరువాత చరిత్ర ఏదో తెలియనీయక పూర్వ చరిత్రే రాముడు ప్రదర్శించాడు. ముందు
Page 301