ద్వారపాలకుడు జయుడే జయ విజయులే గదా రావణ కుంభకర్ణులయి జన్మించారు. అందులో జయుడే రావణుడు. ఒకరు భగవంతుడైతే మరొక రాయన భక్తుడు. భగవద్భాగవతులకు భేదమేమున్నది. యే భజంతి తుమామ్ భక్త్యామయితే తేషు చాప్యహమ్. ఎవరు నన్ను అనన్య భక్తితో భజిస్తారో వారు నాలో ఉంటే నేను వారిలో ఉంటానని గదా చాటి చెప్పాడు పరమాత్మ మరి అలాంటి అనన్య భక్తుడు రావణరూపధారి అయిన జయుడు. అతడు రామరూప ప్రతిచ్ఛన్నుడైన పరమాత్మకు వేరెలా అవుతాడు. అతడే ఇతడు. ఇతడే అతడు. అంటే రాముడే రావణుడు. రావణుడే రాముడు. ఒకరిపై ఒకరికి ద్వేషంలేదు. శత్రుత్వంలేదు. ఉండటానికి వీలులేదసలు. ఉంటే అది భక్తిగాదు విభక్తి అని చెప్పాము మన భాగవత సామ్రాజ్యంలో.
మరి ఎలా ఏర్పడింది వైరం వారికి. రావణుడు రాముడికెలా అపకారం తలపెట్టా డతణ్ణి ఎలా మట్టుపెట్టాడు. అదే చిత్రం. భవద్భాగవతులిద్దరూ కలిసి ఆడిన నాటకం. మహానాటకం. ఆ నాటకం కూడా వారిద్దరికే తెలుసు మరెవరికీ తెలియదు ఆదిలో తెలియదు. మధ్యంలో తెలియదు. అంతంలోనూ తెలియదు. అయితే వారితోపాటు వారి మూర్తులను మనకు చిత్రించి చూపిన వాల్మీకి మహర్షి ఒక్కడే అయి ఉంటాడు. దాని మర్మం తెలిపిన మహానుభావుడు. ఎందుకంటే మొదట రామకథ అంతా విన్నవాడు చివరనా రామకథ చూచినవాడు ఆ వినటం చూడటం కూడా నిర్లిప్తంగా చేసినవాడు ఆయనే కదా. అందుచేత ఆయన ఒక్కడే ప్రేక్షకుడుగా సాగిన మహానాటకమిది. ఆ ప్రేక్షకుడు మరలా వచ్చి తన అనుభవం మనకు చెబితే మనము తత్ప్రభావంతో దాని మర్మాన్ని కొంతకు కొంత భేదించి చెప్పుకోవచ్చు ఏమిటా చెప్పుకోవలసిన మర్మమంటే చెబుతున్నాను.
ఇద్దరూ ఒకరికొకరు హితులైనా అహితులుగా అభినయించటమే కథలోని మర్మం. భగవద్భాగవతు లయినప్పుడహితులెలా అవుతారు. ప్రియోహి జ్ఞానినోత్యర్ధ మహం సచమమ ప్రియః నేను జ్ఞానికి ప్రియుణ్ణి అతడు నాకు ప్రియడని కదా భగవానుడే గొంతెత్తి చాటాడు. మరి అనన్య భక్తితో వైకుంఠద్వార పాలక పదవి నందుకొని జీవిత జయాన్నే సాధించిన జయుడు కంటే జ్ఞానసంపన్ను డెవడుంటాడు. అలాంటివాడికి నిత్యము సన్నిధిచేస్తూ తన సందర్శన భాగ్యమతనికి నిత్యము
Page 299