#


Index



రామ రావణులు

ద్యోతనం చేశాడాయన. ఇదే రామాయణ కథలోని శైవ వైష్ణవ సంఘర్షణ అయితే మనం గతుకుమననక్కరలేదు.

  అంతేకాదు. ఔత్తరాహ దక్షిణాత్య వ్యవహారం కూడా మాకు సమ్మతమే. ఎలాగంటే ఉత్తరమని దక్షిణమని దేహపాతమైన తరువాత జీవులు నిర్గమించే మార్గాలు రెండున్నాయి. మొదటిదానికి అర్చిర్మార్గమని రెండవ దానికి ధూమమార్గమని పేరు. ఒకటి శుక్లం. మరొకటి కృష్ణం. శుక్లం దేవలోకాలను చేరుస్తుంది. కాబట్టి దాన్ని దేవయానమన్నారు. కృష్ణం పితృలోకానికి చేరుస్తుంది కాబట్టి పితృయాణమన్నారు దాన్ని. పుణ్యకర్మలు చేసినవారంతా దేవయానం చేసి శుక్లమానంలో పయనించి ఉత్తమ లోకాలు చేరితే పాపకర్ములంతా ధూమయానంలో పయనించి అధోలోకాలు చేరి అక్కడ నానాయాతనల పాలవుతారు. పుణ్యకర్మలకంతా రాముడు రామాశ్రితులైన వ్యక్తులంతా ప్రతీకమైతే పాపకర్మలకు ప్రతీకం రావణుడూ రావణ పరివారము అందుకే చివర సరయువులో మునిగి అయోధ్యావాసులంతా రాముడితో పాటు సశరీరంగా స్వర్గానికి వెళ్లగలిగారు. ఆ రాముడి సేవలో నిమగ్నులయినందుకే యుద్ధంలో మరణించిన వానరవీరులు కూడా ప్రత్యుజ్జీవితులు కాగలిగారు. పోతే రాక్షస పరివారమంతా పాపకర్ముడైన రావణుణ్ణి అంటిపట్టుకొన్న నేరాని కతనితో పాటే చివరకు చితాధూమంలో కలిసిపోయి సంయమని చేరి అక్కడ నానాయాతనలకూ గురి కావలసి వచ్చింది. కాబట్టి ఉత్తరాపథం దక్షిణాపథం మీద విజయం సాధించిందని చెప్పినా చెల్లేమాటే. మన ములిక్కిపడనక్కరలేదు.

  ఇంతకూ రామరావణుల చుట్టూ తిరుగుతున్నది రామాయణ కథ అంతా. వారే మూల విరాట్టులు. రామాయణమని పేరేగాని ఎంత రామాయణమో అంత రావణాయనమిది. రాముడి చరిత్ర ఉంది. రావణుడి చరిత్ర ఉంది. ఒకదాని తరువాత ఒకటికూడా గాదు ఒక దానిలో ఒకటి. రాముడి కథ జరిగినంతసేపూ రావణుడి కథ అందులో చోటు చేసుకొనే వుంది. మరి రావణుడి కథ అగస్త్యుడు చెబుతున్నంతసేపూ రాముడి కథా అందులో కలిసి వస్తూనే ఉంది. ఒకదానితోఒకటి ఓతప్రోతంగా పెనవేసుకొని ఉన్నాయి రెండు చరిత్రలు, అసలు రెండు చరిత్రలైతే గదా ఇవి. రెండని మాటేగాని నిజానికొకరిచరిత్ర ఇది. ఎలాగ. రాముడంటే ఎవరు? సాక్షాద్వైకుంఠవాసి అయిన మహావిష్ణువు. మరి రావణుడెవరు ? సాక్షాత్తూ ఆయన

Page 298

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు