ద్వారా దాని ఆధిక్యాన్ని సూచిస్తున్నాడు వాల్మీకి అని మరొకందరు పేర్కొంటారు. ఈలా లోకంలో చిత్రవిచిత్రమైన అభాణకాలున్నాయి రామాయణంమీద రామ రావణులమీద.
చారిత్రకంగానైనా ఇది వాస్తవమో కాదో మన కక్కరలేదుగాని మన ఆధ్యాత్మిక దృష్టికి మాత్రమిది ఎంతో బ్రహ్మాండంగా సమన్వయమవుతున్నది. రాముడు నిజంగా ఆర్యుడే. ఆర్యుడంటే పూజ్యుడనే గదా అర్ధం సకల సద్గుణ సంపన్నుడయిన ఆయన పూజ్యుడు కాకపోవటమేమిటి ? మరి అలాంటి ఆర్యచరిత్రుడికి తీరని ద్రోహం చేసి మాటి మాటికాయనను తూలనాడే స్వభావం గల రావణుడార్యుడెలా అవుతాడు. నిజాని కనార్యడే. కనుకనే ఆయన చేతిలో చివరకు ద్రావిడుడే అయ్యాడు. ద్రవతీతి ద్రావిడః ద్రావిడ ఏవ ద్రావిడః ఎవడుద్రవిస్తాడో వాడు ద్రవిడుడు. ద్రావిడుడే ద్రావిడుడు ద్రవించటమంటే పారిపోవటమైనా కావచ్చు. కరిగిపోవటమైనా కావచ్చు. రెండూ అయ్యాడు రావణుడు. రాముడి చేతిలో ఓడిపోయాడు. అతని బానాగ్ని కాహుతి అయి కరిగిపోయాడు. అందుచేత లోకులనటమనే కాదు. నిజంగా ఆర్య ద్రావిడ చరిత్రే ఇది. ఆర్యుడైన మానవుడు ఉత్కర్ష చాటటానికే అవతరించింది. రామాదివద్వర్తితవ్యమ్ - నరావణాదివత్తని అభిజ్ఞులే వాక్రుచ్చారు గదా.
అలాగే శైవ వైష్ణవ సంఘర్షణను రెచ్చగొట్టి వైష్ణవోత్కర్షను చాటుతున్నదనే మాట కూడా సత్యమే. శైవమంటే ఏమిటి ? శివతత్త్వోపాసన. శివతత్త్వమంటే తమోగుణమే. అలాంటి తామస గుణుల చర్యలెప్పుడూ రాక్షసంగానే ఉంటాయి. సాధుజన బాధకంగానే ఉంటాయి. ఆ గుణం సర్వాత్మనా నిర్మూలమైతేగాని లోకానికి క్షేమం లేదు. ఎలా అవుతుందది నిర్మూలం. దానికి విరుగుడు శుద్ధసత్త్వం. అదే వైష్ణవమనే సంకేతం చేత సూచితమవుతున్నది. వ్యాపనశీలమే వైష్ణవమంటే. సర్వవ్యాపకమైన ఆసత్త్వగుణాన్ని అలవరుచుకొని తద్బలంతో సాధన మార్గ నిరోధకమైన తామస గుణాన్ని రూపుమాపాలి. రాముని శివధనుర్భంగంలో వాల్మీకి ధ్వనింపజేసిన సత్యమిదే. రావణుడు శివోపాసకుడై పది శిరస్సులనూ హోమం చేయటానికి యత్నించి సిద్ధి పొందికూడా చివరకు దెబ్బ తినటం తామస రూపమైన వామాచారానికెప్పటికీ విజయంలేదని చాటటమే. అది ఎప్పటికైనా సాత్త్వికమైన సమయాచారంవల్ల సాధించిన బలంతో వీగిపోక తప్పదని రావణసంహారంలో
Page 297