రామ రావణులు
దైవాసుర శక్తులను గూర్చి ఇంతవరకూ చర్చించాము. రెండూ కలిసి చివరకు దైవకార్యానికే దోహదం చేశాయని కూడా పేర్కొన్నాము. పోతే ఆ రెండు శక్తులు ఏ తత్త్వాలను భజించాయో ఆ మూలతత్త్వాలను గురించి ఇపుడు చెప్పుకోవలసి ఉన్నది. ఆ తత్త్వాలేవో కావు. రామ రావణులే. కథానాయకుడొకరైతే ప్రతినాయకుడొకరు. ఒకటి దైవసంపదతో నడిస్తే దానికి ప్రతీపమైన అసుర శక్తితో నడిచింది మరొకటి. రెంటినీ అలా నడుపుతూ వచ్చింది రెండు మాయలే. ఒక మాయ లోకకంగ్రహం చేసి వెళ్ళిపోతే మరొకటి ఇంకా లోకసంగ్రహం చేయవలసి నిలచిపోయింది ఏమిటది చేయవలసిన లోకసంగ్రహం. ఎప్పుడూ నేను ఇలాగే పొంచి ఉంటాను. మీరెప్పుడేమరి ఉంటే అప్పడల్లా మిమ్మల్నీ అరిషడ్వర్గాలలో ముంచి వేస్తుంటాను. సర్వస్వాన్నీ అపహరించి చివరకు ప్రాణాలే హరించగలను. సుమా! నన్ను గుర్తించి ధర్మమార్గ మేమరక బాగుపడండి మీరని నిత్యమూ మనలను హెచ్చరించటమే. అందుకే సీత రాముణ్ణి వీడిపోయినా మందోదరి లోకాన్ని వీడిపోలేదు. అసలవికాదు వీడటమూ, నిలవటమూ శక్తి జడం దానికి స్వతహాగా అస్తిత్వంలేదు. చేతనాన్ని ఆశ్రయిస్తేనే అది చేతనం. శక్తిని నడుపుతున్నాడు. ఈ ద్విముఖంగా నడపటమూ మరలా దాన్ని ఏకముఖంగా జీవిత గమ్యాన్ని చేర్చటానికే. అది సర్వాభ్యుదయ కారకమైన ధర్మ పురుషార్థమే. అందుకే రామావతారం. అందుకే రావణావతారం.
ఆంతర్యంలో దాగి ఉన్న ఈ సామరస్యం గుర్తించ లేక కొందరీ పాత్రలను చారిత్రకంగా మాత్రమే దర్శించి ఆ దృష్టితో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. రాముడార్యుడని రావణుడు ద్రావిడుడని రావణుణ్ణి రాముడు కంటే తక్కువ చేసి చూపటం వాల్మీకి ఆర్యుల ఉత్కర్షను చాటడానికే నని కొందరంటారు. కొందరికి శైవ వైష్ణవ మతాలకున్న పరస్పర విద్వేషానికి ద్యోతకం రాముడు వైష్ణవానికి రావణుడు శైవానికి ప్రతినిధులు. రావణుడు దుర్మార్గంగా ప్రవర్తించాడని చెప్పటం శైవమంతా వామాచారమని చాటటమేనని చెబుతారు. అది కూడా కాదు. అయోధ్యావాసులైన రామాదులంతా ఔత్తరాహులు. లంకా నివాసులైన రాక్షసులంతా దాక్షిణాత్యులు. ఉత్తరాపధం దక్షిణాపధం కన్నా గుణసంపదలో నాగరికతలో గొప్పదని ఈ కథ
Page 296