#


Index



సీతా మందోదరులు

నచ్చజెపుతుంది. ఎదిరిస్తుంది. మందలిస్తుంది కూడా. సీతాలాంగల పద్ధతిః అన్నట్టు ఆవిడ సీత గనుకనే లాంగలం లాగా ఆయన బుద్ధిని దారికి మళ్లించగలదు. ఇక్కడ అలా కాదు. మందోదరమిది. భర్తనొకమాట అనలేదు. చేయలేదు. అతడేది చేస్తున్నా ఒక ఘనకార్యమేనని కేవలం గుడ్లప్పగించి చూస్తుంటుంది. దారి మళ్లించలేదు. మళ్లించే ధైర్యమూ లేదు. ఆర్జవమే లేనప్పుడు ధైర్యమెలా వస్తుంది. పైకి భీకరాలు చెబుతుందే గాని చేయలేదు. ధి గస్తు హృదయం యస్యా - మమేదంస - సహస్రధా త్వయి పంచత్వ మాపన్నే - ఫలతే శోకపీడితమ్. నీవు మరణించావని తెలిసి కూడా నా హృదయం వేయి చీలికలయిపోక ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే ఎంత సిగ్గుచేటు. అని అంటుందే గాని అతడి శవంతో సహగమనం చేసింది కాదు. అదే అసుర శక్తి దైవశక్తికీ తేడా. దైవశక్తికీ తాను చేయని అపరాధం ప్రజలతో పాటు భర్తకూడా తన కంటగడితే వారికి పాఠం చెప్పాలని ఆ భర్త ఉండగానే తాను లోకంలో నుంచి తప్పుకొన్నది. మరి ఈ అసుర శక్తి. భర్త శతాపరాధాలు చేసినా లోకమంతా బ్రువ్వదిట్టినా అది తెలిసి అతడి ఘటం తప్పిన తరువాత కూడా లోకంలో నిలిచి ఉన్నది. పోతాను చేస్తానన్న మానవురాలు పోగూడదా. ఎలా పోతుంది. అసురమాయ గదా. పోదు.







Page 295

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు