తీరుతుందని. ఈ సత్యం తెలుసుకోవటాని కింతకాలం పట్టిందన్న మాట ఆ మహాతల్లికి. సర్వనాశనమయిన తరువాత తెలిస్తే ఎంత. తెలియకుంటే ఎంత. కథంచ నామ తేరాజంల్లోకా నాక్రమ్య తేజసా నారీచౌర్య మిదం క్షుద్రం కృతం కౌండీర్యమానివా. ఇది చూడండి ఈ మాట. ఇన్ని లోకాలాక్రమించి ఇంత శౌండీర్యం చూపిన నీవీక్షద్రమైన నారీ చౌర్యానికెలా పాలుపడ్డావు అంటుంది. రాముడు లేకుండా చూచి తెచ్చావావిడ నది నీ పిరికితనం కాదా అంటుంది. సత్యవాక్సమహా బాహో దేవరోమే. నా మరది మహానుభావుడెప్పుడో ముందుగానే ఇలాంటి ఉపద్రవం రాబోతుందని గుర్తించే నీకు హితోపదేశం చేశాడు. అయినా నీవతని మాట పాటించలేక కామక్రోధ కృతమైన వ్యసనానికి పాలుపడి ఇంత అనర్థం నెత్తికి తెచ్చుకొన్నావు. అందరి నెత్తికి తెచ్చిపెట్టావు. నీదేమిటిలే ? సుకృతం దుష్కృతంచత్వం గృహీత్వా స్వాంగతిం గతః పుణ్యమో పాపమో నీవు చేసుకొన్నది నీవే వెంట బెట్టుకొని పోయావు. ఆత్మాన మను శోచామి త్వద్వి యోగేన నీవు పోయినందుకు నేను బాధపడుతున్నాను అని ఆక్రోశిస్తుంది. ఎందుకీ ఆక్రోశం. అతడు పోయినందుకు కూడా కాదు. ప్రియామివో పగూహ్యత్వం వేషే సమర మేదినీమ్. ప్రియురాలిలాగా సమర భూమిని కౌగిలించుకొని పడుకొన్నాడు. అప్రియామివ కస్మాచ్చ మాంనేచ్ఛ స్యభి భాషితుమ్. ఇష్టం లేని మనిషిలాగా తనవైపు చూడటంలేదు. మాట్లాడటం లేదు. ఇదీ ఆవిడ మనసులోని అసలు బాధ. ఇప్పుడైనా వాడేదో వరప్రభావంవల్ల మరలా బ్రతికి వస్తే చాలు. ఇక ఈ బీద పలుకులేవీ ఉండవు. ఈ అభావ వైరాగ్యము ఉండబోదు. వాడి మంచి చెడ్డలతో తనకు నిమిత్తం లేదు. ఏ పని చేస్తున్నా సరే. తన పెనిమిటి తనకు కామదాత అయినంత వరకూ తనకతడు గొప్పవాడే. తాను గొప్పదే. మరి ఎవరెలా పాడయిపోయినా పరవాలేదు.
ఇదీ అసురమాయ లక్షణం. దేవమాయలాగా ధైర్యం లేదు దానికి. ఆర్జవం లేదు. స్వార్ధం తప్ప ఏదీలేదు. ముందు చెప్పినట్టు పైకి నిర్మలంగా కనిపిస్తుంది. లోపల చాలా మందం. అందుకే మందోదరి. అది తానే చెబుతున్నది కంఠోక్తిగా. న సంబుద్ధా కదాచిదపి మందయా అని స్వభావంలో అలాంటి విసం వాద వ్యవహారం అసుర శక్తికే. దైవశక్తికి కాదు. కనుకనే సీతాదేవి రాముని ఎడల భక్తి వినయాదులు చూపినప్పుడు చూపినా సమయం వచ్చినప్పుడల్లా ఆయనకు సలహా ఇస్తుంది.
Page 294